Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ పై చిన్న హీరోదే పై చేయి కానుందా?
By: Tupaki Desk | 20 Oct 2019 2:30 PM GMTతమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన 'బిగిల్' చిత్రం తెలుగులో విజిల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి కానుకగా విజిల్ చిత్రాన్ని ప్రపంచం వ్యాప్తంగా ఈనెల 27న విడుదల చేయబోతున్నారు. విజయ్.. అట్లీ కుమార్ ల కాంబోతో పాటు నయనతార హీరోయిన్ గా నటించడం ఏఆర్ రహమాన్ సంగీతం అందించడం వంటి కారణాల వల్ల తమిళనాట ఈ చిత్రంపై బజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగిల్ ట్రైలర్ కు రెండు మిలియన్ ల లైక్స్ యూట్యూబ్ లో వచ్చాయంటే ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇంతటి భారీ క్రేజ్ ఉన్న 'బిగిల్' కు పోటీగా విజయ్ కంటే కాస్త తక్కువ క్రేజ్ ఉండే కార్తీ తన 'ఖైదీ' చిత్రంతో రాబోతున్నాడు. ఈనెల 25న అంటే బిగిల్ కు రెండు రోజుల ముందు ఖైదీ విడుదల కాబోతుంది. తమిళనాట ఖైదీకి కష్టాలు ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని తెలుగులో మాత్రం ఖైదీ తర్వాత విడుదలయ్యే విజిల్ ను ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తమిళనాట విజయ్ సూపర్ స్టార్ అయినా కూడా తెలుగులో మాత్రం కనీసం కార్తీకి ఉన్న క్రేజ్ కూడా లేదు. ఇప్పటి వరకు విజయ్ నటించిన ఏ సినిమా కూడా తెలుగులో పెద్దగా ఆడింది లేదు. కాని కార్తీ సినిమాకు తెలుగులో మంచి మార్కెట్ ఉంటుంది. ఖైదీ సినిమాకు కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. విజిల్ మరియు ఖైదీ తెలుగు రైట్స్ విషయంలో కూడా దాదాపుగా సమానమైన మార్కెట్ అయినట్లుగా తెలుస్తోంది.
కార్తీకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఖైదీనే ఎక్కువ థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఖైదీ కాస్త పాజిటివ్ టాక్ ను దక్కించుకుంటే విజిల్ సినిమా కోసం థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు కనిపించక పోవచ్చు అంటున్నారు. విజిల్ మరియు ఖైదీ రెండింటికి కూడా హిట్ టాక్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.