Begin typing your search above and press return to search.

క్రేజీ సీక్వెల్ పై క్రేజీ అప్ డేట్ తో క్లారిటీ ఇచ్చేశాడు!

By:  Tupaki Desk   |   20 Oct 2022 11:30 PM GMT
క్రేజీ సీక్వెల్ పై క్రేజీ అప్ డేట్ తో క్లారిటీ ఇచ్చేశాడు!
X
కోలీవుడ్ లో వున్న క్రేజీ హీరోల్లో కార్తి ఒక‌రు. త‌ను చేసే ప్ర‌తి ప్రాజెక్ట్ ని భిన్నంగా వుండేలా ప్లాన్ చేసుకుంటూ త‌మిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ని, క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. త‌న‌దైన మార్కు సినిమాల‌తో త‌మిళ‌, తెలుగు ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ హీరోగా ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్నారు. త‌మిళంతో హీరో సూర్య సోద‌రుడిగా తెరంగేట్రం చేసిన కార్తి హీరోగా అన‌తి కాలంలోనే త‌న‌దైన మార్కు ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.

అదే పంథాలో తెలుగులోనూ భారీ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుని ఇక్క‌డ కూడా త‌న సినిమాల‌ని రిలీజ్ చేస్తూ విజ‌యాల‌ని సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా కార్తి న‌టించిన క్రేజీ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ 'స‌ర్దార్‌' ఈ నెల 21న ఒకేసారి త‌మిళ‌, తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

తొలిసారి వ‌య‌సు మ‌ళ్లిన వ్య‌క్తిగా, యంగ్ క్యారెక్ట‌ర్ లో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా కార్తి న‌టించిన ఈ మూవీపై తెలుగులోనూ భారీ అంచ‌నాలున్నాయి. పీఎస్ మిత్ర‌న్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని తెలుగులో కింగ్ నాగార్జున అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై రిలీజ్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా హీరో కార్తి త‌న క్రేజీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు. లోకేష్ క‌న‌గ‌రాజ్ డైరెక్ష‌న్ లో కార్తి న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'ఖైదీ'. హీరోయిన్ , ఎలాంటి బ్యూయెట్స్ లేకుండా కేవ‌లం సినిమా మొత్తం సింగిల్ కాస్ట్యూమ్‌.. అది కూడా చిర‌గిన చొక్కా.. లుంగీతో హీరో కార్తి ప్ర‌యోగాత్మ‌కంగా న‌టించాడు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ నిర్మించిన ఈ మూవీ త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి కార్తికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

రెగ్యుల‌ర్ సినిమాల‌కు పూర్తి భిన్నంగా కార్తి చేసిన ఈ మూవీకి ఎప్పుడెప్పుడు సీక్వెల్ వ‌స్తుందా? అని త‌మిళ ప్రేక్ష‌కుల‌తో పాటు తెలుగు ప్రేక్ష‌కులు గ‌త కొన్ని నెల‌ల‌గా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం 'ఖైదీ' మూవీని హిందీలో అజ‌య్ దేవ‌గ‌న్ హీరోగా 'భోళా' పేరుతో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. 'సర్దార్‌' మూవీ ఈ నెల 21న విడుద‌ల‌వుతున్న నేప‌థ్యంలో మీడియాతో ముచ్చ‌టించిన హీరో కార్తి 'ఖైదీ' సీక్వెల్ పై క్రేజీ అప్ డేట్ ని ఇచ్చేశాడు.

'ఖైదీ' సీక్వెల్ కోసం నేను కూడా చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. అల్రేడీ లోకేష్ క‌న‌గ‌రాజ్ క‌థ పూర్తి చేశాడు. అయితే ఈ సినిమాని వ‌చ్చే ఏడాది 2023 ఎండింగ్ లో ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నాం' అని అస‌లు విష‌యం చెప్పేశాడు. దీనికి ముందు లోకేష్ క‌న‌గ‌రాజ్ స్టార్ హీరో విజ‌య్ తో ఓ భారీ గ్యాంగ్ స్ట‌ర్ మూవీని రూపొందించ‌నున్న విష‌యం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.