Begin typing your search above and press return to search.

కస్తూరి జోకేసింది.. కార్తి కౌంటర్ ఇచ్చాడు

By:  Tupaki Desk   |   5 March 2019 6:39 AM GMT
కస్తూరి జోకేసింది.. కార్తి కౌంటర్ ఇచ్చాడు
X
సెల్ఫీలనేవి మన దైనందిన జీవితంలో అంతర్భాగం అయిపోయాయి. కొందరు వాటి మాయలో పడి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. ఎత్తైన కొండల అంచున నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. మూవింగ్ రైలుతో సెల్ఫీ తీసుకునెందుకు రైల్ ట్రాక్ పక్కనే నిలబడి గాయాలపాలైనవారు కూడా ఉన్నారు. ఇవే కాదు సెలబ్రిటీలు కనిపిస్తే ఎలాగైనా వారితో సెల్ఫీ తీసుకోవాలని వారిని ఇబ్బంది పెట్టిన వారు కూడా ఉన్నారు. సీనియర్ తమిళ హీరో శివ కుమార్ తో ఇలాంటి సెల్ఫీ ఫ్యాన్స్ విషయంలో కోపం రావడంతో వారి ఫోన్ పగల కొట్టడం.. ఆయనకు చెడ్డపేరు రావడం కూడా తెలిసిన విషయాలే.

రీసెంట్ గా 'జులై కాట్రిల్' సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కు కార్తి అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి సినియర్ నటి కస్తూరి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆ కార్యక్రమంలో ఆవిడ ఒక సెల్ఫీ తీసుకుంటూ 'పక్కన శివ కుమార్ గారు లేరు కదా?' అంటూ ఒక జోకేసింది. జోకు మంచిదే.. కొందరు నవ్వారు కారు కానీ అక్కడ ఉన్న శివకుమార్ తనయుడు కార్తి కి చిర్రెత్తుకొచ్చింది. కార్తి తన స్పీచ్ ఇచ్చే సమయంలో "సెల్ఫీ తీసుకోవాలనుకోవడం ఓకే కానీ సెలబ్రిటీలను నెట్టడం.. సెల్ఫి కోసం ఫోను ను వారి మొహానికి అడ్డంగా పెట్టడం ఎంత వరకూ సబబు?" అంటూ చురకలంటించాడు." సెల్ఫీ తీసుకోవాలంటే వారి పర్మిషన్ తీసుకోవాలి కదా? ఒకవేళ అలా కుదరకపోతే కాస్త మర్యాదగా వ్యవహరించాలి కదా?

కార్తి ఫాదర్ శివ కుమార్ దురుసుగా వ్యవహరించడాన్ని ఎవరూ సమర్థించరు కానీ 'సెల్ఫీల పేరుతో సెలబ్రిటీలను నెట్టడం.. లాగడం.. ఫోన్లను వాళ్ళ మొహాలకు అడ్డంగా పెట్టడం కరెక్ట్ కాదు కదా? ఈమధ్య ఒకసారి బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఒక వెర్రి అభిమాని సెల్ఫీ తీసుకునే వరకూ ఆయన ముందుకు నడిచి వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు. సరిగ్గా చెప్తే.. ప్రేయసిని బంధించినట్టు ఆయనను తన కబంధహస్తాలలో బంధించాడు. ఇంకా నయం.. నవాజ్ ప్లేస్ లో మన టాలీవుడ్ సీనియర్ హీరో కనుక ఉండి ఉంటే వాడికి జింతాత జిత అయి ఉండేది...!