Begin typing your search above and press return to search.
షూట్ కు ఊరెళ్లిన హీరోకి అదిరే షాక్ తగిలిందట
By: Tupaki Desk | 21 Oct 2019 5:37 AM GMTపేరుకు తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. టాలీవుడ్ లో అతనికంటూ ఒక మార్కెట్ ఉంది. అభిమానగణం ఉంది. అలాంటి అతగాడి తాజా మూవీ ఖైదీ దీపావళి పండుగ సందర్భంగా ఈ వారం విడుదల కానుంది. సినిమా న్యూస్ ను పక్కన పెడితే.. ఈ డిజిటల్ కాలంలో మారిన ప్రేక్షకుల అభిరుచి గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు కార్తీ.
సినిమాను ప్రేక్షకులు చూసే తీరు మారిపోతుందని.. డిజిటల్ యుగంలో గతానికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అమేజాన్.. నెట్ ఫ్లిక్స్ పుణ్యమా అని ఫోన్ లోనే సినిమాల్ని చూసేస్తున్నారని.. డిజిటల్ లో మూవీలు సిటీలో ఉన్న వారే చూస్తారన్న తన అభిప్రాయం తప్పైందన్నారు.
తానో సినిమా షూటింగ్ కోసం ఒక చిన్న గ్రామానికి వెళితే.. అక్కడి వారిలో కొందరు మనీ హెస్ట్ షో చూశారా? అని అడుగుతున్నారని చెప్పారు. ఇలా సినిమా ఏదైనా చూసేస్తున్నారని చెప్పారు. తనకు ఎదురైన షాకింగ్ ఉదంతాన్ని చెప్పుకొచ్చారు.
ఇక.. విడుదలకు సిద్ధమైన తన ఖైదీ మూవీ గురించి కొన్ని విషయాలు చెప్పేస్తూ.. కథలో కావాల్సినంత సస్పెన్స్ ఉందని.. థ్రిల్ ఉన్నాయని అందుకే పాటలు.. రొమాన్స్ పెట్టలేదన్నారు. ఇది ఫుల్ మాస్ సినిమా అని.. తన పాత్ర ఊరమాస్ గా ఉంటుందన్నారు. అంతేకాదు.. సినిమాలో తాను ఒక్కడినే హీరోను కాదని.. సందర్భానికి తగ్గట్లు ఒక్కో పాత్ర హీరోలా మారుతుందని వెల్లడించాడు.