Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ మిస్.. నేను హ్యాపీ

By:  Tupaki Desk   |   1 April 2016 10:25 AM GMT
ఎన్టీఆర్ మిస్.. నేను హ్యాపీ
X
ఇప్పుడు టాలీవుడ్ - కోలీవుడ్ లలో ఒకే మూవీ గురించి చర్చ జరుగుతోంది. నాగార్జున - కార్తీలు హీరోలుగా నటించిన ఊపిరి చిత్రం సాధించిన విజయం సామాన్యమైనదేమీ కాదు. ఓ ఫ్రెంచ్ మూవీని తీసుకుని.. పర్ఫెక్ట్ గా లోకలైజ్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు దర్శకుడు వంశీ పైడిపల్లి.

ఊపిరిలో నాగ్ పాత్ర ఎంత కీలకమో.. కార్తి పోషించిన రోల్ కూడా అంతే ముఖ్యం జైల్ నుంచి వచ్చిన ఓ స్లమ్ కుర్రాడి పాత్రలో కార్తి ఒదిగిపోయిన తీరు అందరినీ మెప్పించింది. అయితే ఈ పాత్ర గురించి అందరూ మాట్లాడుకోవడం, తనకు విపరీతమైన ప్రశంసలు రావడంపై కార్తి స్పందించాడు. 'ఫ్రెంచ్ సినిమా ది ఇన్ టచబుల్స్ ని చూసిన తర్వాత.. దీన్ని మన ఆడియన్స్ కు తగ్గట్లుగా తీయడం చాలా కష్టం అని భావించాను. కానీ వంశీ పైడిపల్లి నాకు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చాడు' అన్నాడు కార్తి.


'నేను చేసిన రోల్ ఎన్టీఆర్ చేయాల్సినది అని నాకు తెలుసు. వంశీకి దగ్గర మూడు ఆప్షన్స్ ఉన్నాయి. అందులో నేనొకడిని. అప్పుడు ఎన్టీఆర్ మిస్ కావండతోనే.. నాకు ఈ రోల్ దక్కింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా' అంటున్నాడు కార్తి. ఇప్పటికే 45 కోట్లకుపైగా షేర్ రాబట్టిన ఊపిరి.. సేఫ్ ప్రాజెక్ట్ అయేందుకు మరెన్నో రోజులు పట్టదు.