Begin typing your search above and press return to search.

కుర్రాడికి పర్మినెంట్‌ ప్లేస్‌ దొరికినట్లే

By:  Tupaki Desk   |   29 March 2016 12:25 PM GMT
కుర్రాడికి పర్మినెంట్‌ ప్లేస్‌ దొరికినట్లే
X
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్యకు తమ్ముడుగా సినిమాల్లో అడుగు పెట్టాడు కార్తి. మొదటి సినిమాలోనే విభిన్నమైన కేరక్టర్ తో ఆకట్టుకోవడంతో తమిళనాట బాగానే ఆదరణ లభించింది. ఆ తర్వాత అన్న వెంటే తెలుగులో పాగా వేసేందుకు ట్రై చేశాడు. యుగానికొక్కడులో సూర్య కి బ్రదర్ గానే ఇంట్రడక్షన్ జరిగినా.. ఆ మూవీ మంచి విజయం సాధించింది.

ఆ తర్వాత వచ్చిన ఆవారా మూవీలో తమన్నాతో ఈ అందగాడు చేసిన రొమాన్స్ అందరినీ ఆకట్టుకుంది. దీనికి తోడు యాక్షన్ సీక్వెన్స్ లలో ఇరగదేసీయడంతో టాలీవుడ్లో కార్తి స్థిరపడిపోయినట్లే అనుకున్నారు. కానీ ఆ తర్వాతి సినిమాలు మాత్రం నిరుత్సాహపరిచాయి. నా పేరు శివ లాంటి కొన్ని మూవీస్ ఇక్కడి జనాలను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కార్తి సినిమాలను డబ్బింగ్ చేయడం కూడా మానేశారు నిర్మాతలు. ఇప్పుడు ఊపిరి మూవీతో నాగార్జునతో కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తి.. అందరి మన్ననలు అందుకుంటున్నాడు. మాస్ కుర్రాడిగా తన కేరక్టర్ లో జీవించేశాడు కార్తీ.

ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా ఊపిరి నిలుస్తుందనే అంచనాలున్నాయి. ఒకవేళ ఇది సాధ్యమైతే.. తెలుగు సినిమాల్లో కార్తికి పర్మినెంట్ ప్లేస్ దొరికేసినట్లే. మరోవైపు.. యూఎస్ బాక్సాఫీస్ లోనూ ఇప్పుడు కార్తి సినిమాలకు ఎంక్వైరీలు జరుగుతుండడం విశేషమే.