Begin typing your search above and press return to search.
హారర్ సినిమాతో కొట్టేస్తావా ఆవారా?
By: Tupaki Desk | 14 Jun 2016 4:35 AM GMTసూర్య తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి.. అన్న దారిలో విభిన్నమైన సినిమాలు చేస్తూ.. కోలీవుడ్ లో కార్తి బాగానే సెటిల్ అయిపోయాడు. మొదట్లో ఒకటి రెండు సినిమాలు బాగా ఆడ్డంతో టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపే వచ్చింది. కానీ దాన్ని నిలబెట్టుకోవడం మాత్రం ఈ కుర్ర హీరో వల్ల కాలేదు. మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసేందుకు నానా తంటాలు పడుతున్నాడు. రీసెంట్ గా బై లింగ్యువల్ మూవీ ఊపిరితో మంచి ప్రయత్నమే చేశాడు కార్తి.
తెలుగులో ఊపిరి హిట్ అనిపించుకున్నా.. తమిళ్ వెర్షన్ తోఝా మాత్రం నిరుత్సాహపరిచింది. దీంతో కోలీవుడ్ లో అర్జంట్ గా ఓ హిట్ కొట్టి ఫాంలోకి రావాల్సిన అవసరం కార్తీకి ఏర్పడింది. ఇటు తెలుగులో కూడా సోలోగా హిట్ కొట్టి చాలాకాలమే అయింది. అందుకే ఇప్పుడు ఓ హారర్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడీ యంగ్ హీరో. 'కాష్మోరా' అనే టైటిల్ పై ఓ భయంకరమైన సినిమా చేసేశాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంది.
కార్తీకి జంటగా నయనతార - తెలుగమ్మాయి శ్రీదివ్యలు నటించడంతో.. రెండు భాషల్లోనూ ఈ ప్రాజెక్టుపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మాంచి పబ్లిసిటీ యాక్టివిటీతో దీన్ని హైప్ గా మార్చి.. సక్సెస్ కొట్టేయాలనే ప్లాన్ వేశాడట కార్తీ. పబ్లిసిటీ ఐడియాలదేముంది కానీ కార్తీ.. టైటిల్ కాష్మోరాలోనే కాకుండా.. మూవీలో కంటెంట్ ఉండేలా చూస్కుంటే.. హిట్ ఆటోమేటిగ్గా పడుతుంది. అది జాగ్రత్త పడితే చాలు.