Begin typing your search above and press return to search.
కాష్మోరా.. మరీ ఎగ్జైట్ అయిపోకండి
By: Tupaki Desk | 25 Oct 2016 3:30 PM GMTకార్తి హీరోగా ‘కాష్మోరా’ అనే సినిమా ఒకటి తెరకెక్కుతున్న సంగతి కూడా తెలుగు ప్రేక్షకులకు చాలా రోజుల వరకు తెలియదు. ఈ సినిమా మొదలయ్యే సమయానికి కార్తి తెలుగు మార్కెట్ బాగా దెబ్బ తింది. ఐతే ‘ఊపిరి’తో మళ్లీ మార్కెట్ పెంచుకోవడం.. దీనికి తోడు ‘కాష్మోరా’ ఫస్ట్ లుక్ పోస్టర్.. ట్రైలర్ క్యూరియాసిటీని పెంచడంతో సినిమాపై ఒక్కసారిగా తెలుగులోనూ హైప్ మొదలైంది. దీపావళికి ఈ చిత్రం తెలుగు సినిమాల తరహాలో భారీ స్థాయిలో రిలీజవుతోంది. ట్రైలర్లోని విజువల్స్ చూసి చాలా ఎగ్జైట్ అయిన ప్రేక్షకులు సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు. ముఖ్యంగా కార్తి గుండుతో భీకరమైన అవతారంలో దర్శనమిస్తున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మీదే అందరి కళ్లూ నిలిచి ఉన్నాయి.
ఐతే ఈ ఎపిసోడ్ విషయంలో మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే కష్టమే. ఎందుకంటే 2 గంటల 44 నిమిషాల సుదీర్ఘ నిడివి ఉన్న సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండేది కేవలం 30 నిమిషాలే అట. నయనతార కనిపించేది కూడా ఆ 30 నిమిషాల్లోనే. అంటే కాష్మోరాలో భారీ తనం అంతా ఆ 30 నిమిషాలకే పరిమితం. ఏం అద్భుతాలు చూపించినా ఆ 30 నిమిషాల్లోనే చూపిస్తారు. మిగతా నిడివి 2 గంటల 14 నిమిషాలు రెగ్యులర్ సినిమాల తరహాలోనే సాగుతుంది. మరి మిగతా సినిమాతో ఏమాత్రం మెప్పిస్తారో చూడాలి. ఇంతకీ వార్ ఎపిసోడ్ అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుందా.. అది ఏమేరకు మెప్పిస్తుంది.. మిగతా సినిమా ఎలా ఉంటుంది అన్నదాన్ని బట్టి ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/