Begin typing your search above and press return to search.
చిరుతో క్లాష్ కి సై అంటున్న హీరో?
By: Tupaki Desk | 21 Aug 2019 1:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2 విడుదలవుతున్న సంగతి తెలిసిందే. టీజర్ తో అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. మెగా ఫ్యాన్స్ రెండేళ్ల నిరీక్షణ అందులోనూ స్వాతంత్ర సమరయోధుడి గాధ కావడంతో సామాన్య ప్రేక్షకుల్లోనూ దీని మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది. అందుకే పోటీకి ఎవరు సిద్ధపడటం లేదు. వెంకీ మామను తొలుత అక్టోబర్ 4 అనుకున్నప్పటికీ సైరాతో పోటీ అన్నిరకాలుగా రిస్క్ అని భావించి 25కి షిఫ్ట్ చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి.
సైరా ఎలాగూ మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతోంది కాబట్టి తమిళ్ కన్నడలో సైతం ఇతర నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. కానీ కార్తీ కొత్త సినిమా నిర్మాతలు మాత్రం పోటీకి సై అంటున్నారని ఫిలిం నగర్ టాక్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ నటించిన ఖైదీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కొంత ఆలస్యం కావడంతో పాటు సరైన రిలీజ్ డేట్ దొరక్కపోవడంతో ఇన్నాళ్లు వెయిట్ చేసిన టీమ్ సెప్టెంబర్ 27 లాక్ చేసే దిశగా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం. ఆ డేట్ కి సైరాకు కేవలం 5 రోజుల గ్యాప్ మాత్రమే ఉంటుంది.
తమిళ్ లో ఓకే కానీ తెలుగు రాష్ట్రాలు కర్ణాటకలో సైరాను కాదని ఖైదీని ఉపేక్షించి థియేటర్లలో కొనసాగించేంత సీన్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఫస్ట్ వీక్ లోనే సినిమా డేంజర్ లో పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇక్కడ మార్కెట్ లాస్ అయ్యే ప్రమాదం చాలా ఉంది. ఇదంతా కార్తీ ఆలోచిస్తే అంత తక్కువ స్పాన్ లో సైరా పోటీతో పడటం ఎంత రిస్కో అర్థమవుతుంది. అలా అని కార్తీ వెనక్కు వెళ్లేందుకు లేదు. సెప్టెంబర్ 20న అన్నయ్య బందోబస్త్ ఉంది. మొత్తానికి కార్తీక్ ఖైదీ పెద్ద కన్ఫ్యూజన్ లో పడ్డట్టే. సెప్టెంబర్ 27 డేట్ ఫిక్స్ అయినట్టు ఆ చెన్నై మీడియాలో మాత్రం గట్టిగానే వినిపిస్తోంది.