Begin typing your search above and press return to search.

చిరు 'ఖైదీ' మాదిరిగానే కార్తీ 'ఖైదీ'

By:  Tupaki Desk   |   26 Oct 2019 11:12 AM GMT
చిరు ఖైదీ మాదిరిగానే కార్తీ ఖైదీ
X
కార్తీ హీరోగా తమిళంలో తెరకెక్కిన 'ఖైదీ' చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్‌ తో నిన్న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. సినిమాలో హీరోయిన్‌ లేదు.. కనీసం ఒక పాట లేదు.. కామెడీ సీన్స్‌ లేవు.. ఏ కోశన కూడా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేవు. ఇలాంటి సినిమాను తెలుగు ఆడియన్స్‌ ఎలా ఆధరిస్తారంటూ మొదట అనుమానాలు వచ్చాయి. ఇలాంటి సినిమాలు తమిళంలో నడుస్తాయి కాని తెలుగులో ఆడటం అనుమానమే అనుకున్నారు. కాని అనూహ్యంగా ఖైదీకి పాజిటివ్‌ టాక్‌ వచ్చి అనూహ్యంగా వసూళ్లు పెరిగాయి.

మొదటి రోజు మొదటి రెండు షోలు కూడా కనీసం 25 శాతం ఆక్యుపెన్సీ లేకుండానే సాగాయట. కాని మౌత్‌ టాక్‌ తో.. సోషల్‌ మీడియాలో పాజిటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అవ్వడంతో ఫస్ట్‌ షో కు ఏకంగా 60 శాతంకు పైగా అన్ని థియేటర్లలో ఆక్యుపెన్సీ వచ్చిందట. కొన్ని థియేటర్లలో హౌస్‌ ఫుల్‌ కూడా అయ్యాయంటూ సమాచారం అందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఖైదీకి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఇక తమిళనాడులో కూడా హీరో విజయ్‌ బిగిల్‌ కు గట్టి పోటీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఖైదీ చిత్రం 1983లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా గురించి పెద్దగా అంచనాలు లేవు. మొదటి రోజు చాలా యావరేజ్‌ వసూళ్లు నమోదు అయ్యాయట. ఆ తర్వాత మౌత్‌ టాక్‌ తో ఇండస్ట్రీ హిట్‌.. బ్లాక్‌ బస్టర్‌.. రికార్డులే రికార్డులు నమోదు అయ్యాయి. ఆ సినిమా టైటిల్‌ ను పెట్టుకున్నందుకు కార్తీకి కూడా మొదట పెద్దగా స్పందన లేకున్నా మౌత్‌ టాక్‌ తో అనూహ్యంగా వసూళ్లు పెరుగుతున్నాయని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.