Begin typing your search above and press return to search.

సినిమా మొత్తం కటిక చీకటిలోనే

By:  Tupaki Desk   |   18 May 2019 9:30 AM GMT
సినిమా మొత్తం కటిక చీకటిలోనే
X
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని అమాంతం మలుపు తిప్పి స్టార్ డం కట్టబెట్టిన ఖైదీ టైటిల్ తో కార్తీ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని షూటింగ్ పూర్తయ్యింది. తెలుగు టైటిల్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. బిజినెస్ డీల్స్ కుదిరితే అదీ అయిపోతుంది. ఇందులో టైటిల్ ని బట్టి కార్తీ ఖైదీగా నటించబోతున్నాడనేది ఈజీగా అర్థమవుతోంది. అయితే దానికి మించిన విశేషం ఇందులో మరొకటి ఉంది.

సినిమా మొత్తం రాత్రి పూటే ఉంటుంది. ఒక్కటంటే ఒక్కటి పగలు షాట్ కనిపిస్తే ఒట్టు అంటున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇతని గత సినిమా సందీప్ కిషన్ తో తీసిన మానగరం. తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ తమిళ్ లో హిట్ అయ్యింది. అదే తరహాలో దీన్ని డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నాడు

ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఖైది షూటింగ్ మొత్తం 62 రోజుల్లో 62 రాత్రిళ్ళు జరిపారు. పగలంతా రెస్ట్ తీసుకుని కేవలం నైట్ మాత్రమే యూనిట్ కు పని చెప్పారు. జైలు నుంచి తన బ్యాచ్ తో కలిసి తప్పించుకునేందుకు కార్తీ వేసే స్కెచ్ తోనే సినిమా నడుస్తుంది.

ఇంత చిన్న లైన్ మీద రెండు గంటలు ఎలా నడిపారు అనే డౌట్ వస్తోంది కదూ. అదే స్క్రీన్ ప్లే మేజిక్ అంటున్నాడు లోకేష్. కార్తీతో పాటు వాసన్ కన్నా రవి తదితరులు తోటి ఖైదీలుగా నటిస్తున్న ఈ సినిమాకు విక్రమ్ వేదా ఫేమ్ సామ్ సిఎస్ సంగీతం అందించాడు.దేవ్ తో బాగా దెబ్బ తిన్న కార్తికి దీని మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఖాకీ తరహలో స్పెషల్ మూవీగా నిలుస్తుందని నమ్ముతున్నాడు. త్వరలోనే విడుదల వివరాలు ఫస్ట్ లుక్ తో పాటు ప్రకటించనున్నారు