Begin typing your search above and press return to search.

అభిమాన హీరోను అలా చూడలేక పోతున్న ఫ్యాన్స్‌

By:  Tupaki Desk   |   13 March 2022 2:30 AM GMT
అభిమాన హీరోను అలా చూడలేక పోతున్న ఫ్యాన్స్‌
X
తమిళ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం సర్దార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో సర్దార్ చిత్రం రూపొందుతుంది. ఆ సినిమాలో కార్తీ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు గా ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు.

కార్తీ తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించబోతున్నాడు. తండ్రి పాత్రలో కార్తీ లుక్‌ చాలా విభిన్నంగా ఉంది. కొడుకు పాత్రలో మాత్రం లుక్‌ చాలా రెగ్యులర్ లో ఉంది. ప్రస్తుతం తండ్రి పాత్రకు సంబంధించిన లుక్‌ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సూర్య తమ్ముడు అయిన కార్తీ అమ్మాయిల మనసు దోచుకునే అందగాడిగా ప్రతి సినిమాలో కనిపిస్తూ ఉంటాడు.

చాలా నాచురల్ గా సింపుల్ గా ఉండే కార్తీ అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. అలాంటి కార్తీని తండ్రి అంటూ అలాంటి పాత్ర లో చాలా మాస్ గా చూపించడంతో ఆయన అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. ఈ సినిమాలో కార్తీ ని డ్యూయల్ రోల్ కాకుండా తండ్రి పాత్రకు మరో నటుడిని నటింపజేస్తే బాగుండేదేమో అంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఒకవేళ తండ్రిగా చేసినా అలా మాస్ గా డీ గ్లామర్ గా చూపించి ఉండకుండా కాస్త స్టైలిష్ గా చూపించి ఉంటే బాగుండేది కదా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన ప్రతి సినిమా ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అలాగే పాత్రల విషయంలో కూడా అంతకు మించి జాగ్రత్తలు తీసుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

దర్శకుడు చెప్పిన కథ మరియు ఆయనకు నచ్చిన స్క్రీన్ ప్లే అవ్వడం వలనే ఇలాంటి పాత్రకు ఒప్పుకుని ఉంటాడు అని కొందరి అభిప్రాయం. మొత్తానికి కార్తీ గెటప్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తమిళంలో తెలుగులో కూడా ఘన విజయాన్ని తెచ్చిపెడుతుంది అంటూ యూనిట్ సభ్యులు మరియు ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.

కార్తీకి తెలుగు లో మంచి గుర్తింపు ఉంది కానీ ఈ మధ్య కాలంలో ఆయన సరైన సినిమాలతో రాలేక పోతున్నాడు. దాంతో ఆయన క్రేజ్ మెల్ల మెల్లగా తగ్గుతుంది అని కూడా టాక్‌ వినిపిస్తుంది.