Begin typing your search above and press return to search.

'అభిమాన్యుడు' ద‌ర్శ‌కుడితో క్రేజీగా కార్తి

By:  Tupaki Desk   |   26 Dec 2019 1:30 AM GMT
అభిమాన్యుడు ద‌ర్శ‌కుడితో క్రేజీగా కార్తి
X
అభిమ‌న్యుడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాతో టాలీవుడ్ లోనూ మిత్ర‌న్ పేరు మార్మోగిపోయింది. ఇటీవ‌లే హీరో చిత్రంతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ప్ర‌స్తుతం విశాల్ హీరోగా `అభిమన్యుడు` సీక్వెల్ పై వ‌ర్క్ చేస్తున్నారు ఈ క్రేజీ త‌మిళ డైరెక్ట‌ర్. అటుపై కార్తీ హీరోగా మ‌రో క్రేజీ చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్ లో వ‌రుస‌ విజయాలు సాధిస్తూ బాక్సాఫీస్ చియాన్ గా మారిన కార్తీతో మిత్ర‌న్ సినిమాకి స‌న్నాహాలు చేస్తున్నాడు. ఇటీవ‌ల వ‌రుస విజ‌యాలు అందుకుంటున్న కార్తీకి ఇది కెరీర్ ప‌రంగా ప్ల‌స్ కానుంద‌నే అంచ‌నా వేస్తున్నారు. మొన్న `ఖైదీ`గా- నిన్న ‘దొంగ’గా బ్లాక్ బస్టర్స్ సాధించిన కార్తి డిమాండ్ తెలుగు మార్కెట్లోనూ బాగానే పెరిగింది. ఆ డిమాండ్ కి త‌గ్గ‌ట్టే క్రేజీ డైరెక్టర్ మిత్ర‌న్ తో ఇంకో సినిమా చెయ్యడానికి రెడీ అయిపోతున్నాడు.

`అభిమన్యుడు` త‌ర్వాత శివ‌కార్తికేయ‌న్ `హీరో`తో మరో బ్లాక్ బ్లస్టర్ అందుకున్న డైరెక్టర్ పి.యస్.మిత్ర ఇక‌పై కార్తి ప్రాజెక్టుపై దృష్టి సారించ‌నున్నాడు. ఆల్రెడీ మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న `పొన్నియన్ సెల్వన్`లో కార్తీ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మిత్ర సినిమాకి కమిటయ్యాడు. మణిరత్నం సినిమా షూటింగ్ పూర్తయ్యాక మిత్ర సినిమా షూటింగ్ లో జాయినవుతాడట.