Begin typing your search above and press return to search.

మణి సినిమాలో కార్తి వెరైటీ రోల్

By:  Tupaki Desk   |   23 March 2016 7:30 AM GMT
మణి సినిమాలో కార్తి వెరైటీ రోల్
X
‘ఓకే బంగారం’ సినిమా రిలీజై పది నెలలు దాటిపోతోంది. కానీ ఇప్పటిదాకా మణిరత్నం తర్వాతి సినిమా మొదలు కాలేదు. ‘ఓకే బంగారం’ మొదలవడానికి ముందు ఏడాది పాటు ఎలా తర్జన భర్జన పడ్డాడో.. ఆ సినిమా రిలీజయ్యాక కూడా అలాంటి గందరగోళంలో ఉన్నాడు మణిరత్నం. ఐతే అప్పుడైతే ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి తర్వాతి ప్రాజెక్టు ఏం చేయాలో తెలియని అయోమయం ఉండి ఉండొచ్చు. కానీ ‘ఓకే బంగారం’ హిట్టయ్యాక కూడా ఈ కన్ఫ్యూజనేంటో అర్థం కాలేదు. రకరకాల కాంబినేషన్లు అనుకుని.. చివరికి అందరినీ పక్కనబెట్టసి కార్తి-సాయిపల్లవి కాంబినేషన్ లో సినిమా తీయడానికి నిర్ణయించుకున్నాడీ లెజెండరీ డైరెక్టర్.

ఈ సినిమా కథేంటన్నది క్లారిటీ లేదు కానీ.. ఇందులో లీడ్ రోల్స్ చేయబోతున్న కార్తి, సాయి పల్లవిల పాత్రలేంటన్నది మాత్రం వెల్లడైంది. కార్తి ఇందులో పైలట్ పాత్ర పోషించబోతున్నాడట. సాయిపల్లవి డెంటిస్టుగా కనిపిస్తుందట. ప్రస్తుతం కార్తి ‘కాష్మోరా’ అనే తమిళ సినిమా కోసం గుండు చేయించుకున్నాడు. అలాగే షూటింగులో పాల్గొంటున్నాడు. మళ్లీ జుట్టు పెరిగి మామూలుగా కనిపించడానికి ఇంకో రెండు నెలలైనా పడుతుంది. షూటింగ్ కూడా అప్పుడే మొదలుకానుంది. ఈ సినిమాలో సరికొత్త లుక్‌ లో దర్శనమివ్వబోతున్నాడట కార్తి. హీరో కావడానికి ముందు కార్తి.. మణి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. మణి ఆస్థాన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమానే ఈ చిత్రానికి కూడా సంగీతాన్నందించబోతున్నాడు.