Begin typing your search above and press return to search.
ఇంటెన్స్ ఎమోషన్స్.. చాలానే ఉన్నాయ్
By: Tupaki Desk | 3 April 2017 1:36 PM GMTతమిళ హీరో కార్తిని.. సూర్య తమ్ముడిగానే కాకుండా.. హీరోగా కూడా అక్కున చేర్చేసుకున్నారు తెలుగు ప్రజలు. టాలీవుడ్ హీరోలు చేయలేమని తేల్చేసిన ఊపిరి చిత్రంలోని రోల్ ను.. తను ఇష్టంగా చేసి మెప్పించాక మరింత దగ్గరైపోయాడు. ఇప్పుడు ఏకంగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం మూవీ 'చెలియా'తో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడీ స్టైలిష్ హీరో.
'రెండేళ్ల పాటు మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడంతోనే నా కెరీర్ ప్రారంభమైంది. పదేళ్ల తర్వాత ఆయన డైరెక్షన్ లో సినిమా చేయడం అంటే.. నా అదృష్టం అంటానంతే. శ్రీనగర్ బ్యాక్ డ్రాప్ లో ఓ ఫైటర్ .. ఓ డాక్టర్ మధ్య జరిగే ఈ లవ్ స్టోరీనే ఈ సినిమా' అంటున్న కార్తి.. ఈ రెండు కేరక్టర్స్ మధ్య సీన్స్ రాయడం చాలా కష్టమని.. నటించడం ఇంకా కష్టమని అంటున్నాడు. అంత క్లిష్టమైన కేరక్టర్ కాబట్టే .. యాక్టింగ్ చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిందని చెప్పాడు. ఈ రెండు కేరక్టర్ల మధ్య నడిచే కథ కావడంతో.. ఇంటెన్స్ ఎమోషన్స్ చాలా డెప్త్ గా ఉంటాని చెబుతున్నాడు. ఓకే బంగారం లైటర్ వెయిన్ లో సాగితే.. చెలియా క్లాసిక్ లవ్ స్టోరీ అని చెప్పాడు కార్తి.
సినిమాలో ఎక్కువ భాగం శ్రీనగర్ లోనే జరగగా.. -4 నుంచి -15 డిగ్రీల సెంటిగ్రేడ్ లో షూటింగ్ జరిపారట. 'మణి రత్నం సార్ వేగంగా సినిమా తీస్తారు. రోజుకు 3-4 సీన్స్ ఫినిష్ చేస్తారు కానీ.. ప్రిపరేషన్ కు ఎక్కువ టైం పడుతుంది. మొత్తం సినిమా షూటింగ్ 2 నెలల్లోపే పూర్తయితే.. అందుకు సిద్ధం కావడానికి ఐదు నెలలకు పైగా పట్టింది' అన్నాడు కార్తి.
మణిరత్నంతో వర్క్ చేయడం చాలా మంది ఇబ్బంది అనుకుంటారని.. కానీ తనకు మాత్రం ఛాలెంజింగ్ గా అనిపించిందని చెప్పిన కార్తి.. ప్రతీ సినిమతో ఏదో ఒకటి కొత్త విద్య నేర్చుకోవడం తనకు అలవాటు అంటున్నాడు. కాష్మోరా కోసం కత్తి యుద్ధాలు.. గుర్రపు స్వారీ నేర్చుకుంటే.. చెలియా కోసం పైలెట్ ట్రైనింగ్ తీసుకోవడం మరిచిపోలేని అనుభూతి అంటూ మైమరచిపోతున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/