Begin typing your search above and press return to search.
అలాగైతే తెలుగులో కష్టం కార్తీ
By: Tupaki Desk | 13 Sep 2019 6:17 AM GMTతమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కార్తి. స్టార్ హీరో సూర్య తమ్ముడిగా ప్రేక్షకులకు పరిచయం అయిన కార్తీ తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నాడు. విభిన్నమైన చిత్రాలను - ప్రయోగాత్మక చిత్రాలను ఎంపిక చేసుకుంటూ కెరీర్ లో ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ఈయన 'ఖైదీ' అనే విభిన్నమైన చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రానికి లోకేష్ కంగరాజు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం గురించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సినిమాలో పాటలు ఉండవని.. కనీసం హీరో కార్తీకి జోడీగా హీరోయిన్ కూడా ఉండదని అంటున్నారు. సినిమా ఎక్కువగా సీరియస్ గా సాగుతుందని.. సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉంటాయంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇలాంటి సినిమాలను తమిళ ఆడియన్స్ గతంలో ఆధరించిన దాఖలాలు ఉన్నాయి. కాని తెలుగులో మాత్రం కష్టం.
తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఎంటర్ టైన్ మెంట్ ఆశిస్తారు. అలాగే సినిమా మంచి ఎండ్ ను కలిగి సంతోషంగా ముగించాలి. అప్పుడే సినిమాను మన తెలుగు ప్రేక్షకులు ఆధరిస్తారు. చాలా చాలా అరుదుగా మాత్రమే కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సినిమాలు సక్సెస్ అయ్యాయి. కార్తీ ఖైదీ తెలుగులో అమ్ముడు పోవాలంటే కాస్త కష్టమే అంటున్నారు. అక్టోబర్ 26న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఖైదీ చిత్రంతో కార్తీ నటుడిగా మరో మెట్టు ఎక్కుతాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. సినిమా ఫలితం పక్కన పెడితే ఇలాంటి సినిమాను చేసినందుకు కార్తీ ఖచ్చితంగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.