Begin typing your search above and press return to search.

సెట్ అయితే అన్నయ్య తో చేస్తా

By:  Tupaki Desk   |   13 Nov 2017 3:54 PM GMT
సెట్ అయితే అన్నయ్య తో చేస్తా
X
యుగానికి ఒక్కడు సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చిన కార్తీ.. మొదట తమిళ్ లో విజయం దక్కలేదు. కానీ తెలుగు ఆడియెన్స్ మాత్రం కార్తీ సినిమాను ఆదరించారు. ఇక ఆ తర్వాత వచ్చిన ఆవారా సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఓ మార్కెట్ ని సెట్ చేసుకున్నాడు ఈ సూర్య బ్రదర్. అంతే కాకుండా ఒకానొక ఫంక్షన్లలో ఏ ఆడియెన్స్ ఎక్కువ ఇష్టం అంటే నాకు మొదట హిట్ ఇచ్చింది తెలుగు ఆడియెన్స్ అని వీళ్లంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పాడు.

దీంతో టాలీవుడ్ ప్రేక్షకులకు కార్తీ మరింత నచ్చాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఎంతో కొంత మంచి ఆదరణను దక్కించుకున్నాయి. అయితే కార్తీ తమిళ్ లో తన సినిమాను ఏ రేంజ్ లో రిలీజ్ చేస్తాడో తెలుగులో కూడా అదే స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక అన్నయ్య సూర్య కూడా టాలీవుడ్ లో మాంచి ఆదరణను దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. సూర్య సినిమాలు చాలా వరకు ఇక్కడ మంచి ఓపెనింగ్స్ అందుకుంటాయి.

అయితే ఈ బ్రదర్స్ కలిసి ఒక సినిమాను చేస్తే బావుంటుందని సౌత్ సినీ అభిమానులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే కార్తీ రీసెంట్ ఫిల్మ్ ఖాకి ఈ నెల రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కార్తీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని గురించి అడుగగా.. కార్తీ మాట్లాడుతూ.. అందుకు మంచి కథ రావాలి అలాగే కాల్షీట్స్ కూడా సెట్ అవ్వాలి.. అవి కుదిరితే తప్పకుండా చేస్తామని కార్తీ తెలిపారు.