Begin typing your search above and press return to search.
కాష్మోరాకు సీక్వెల్.. కండిషన్స్ అప్లై
By: Tupaki Desk | 27 Oct 2016 1:30 AM GMTతమిళ పరిశ్రమ ‘బాహుబలి’ లాంటి సినిమా అవుతుందని ఆశిస్తున్న చిత్రం ‘కాష్మోరా’. ఈ సినిమా పోస్టర్లు.. ట్రైలర్ చూస్తే అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. కార్తి అండ్ కో కూడా ఈ సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ శుక్రవారమే తేలిపోతుంది. ఐతే సినిమా అంచనాలకు తగ్గట్లుగా ఆడితే.. ‘బాహుబలి’ తరహాలో దీనికి రెండో భాగం కూడా చేస్తాం అంటున్నాడు కార్తి. ‘బాహుబలి’తో తమ సినిమాను పోల్చి చూడొద్దని అంటూనే.. ‘బాహుబలి’ ప్రమాణాల్ని అందుకోవడానికి తాము ప్రయత్నించామని అతను చెప్పాడు.
‘‘కాష్మోరా మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ‘బాహుబలి’తో పోలిస్తే మా బడ్జెట్ చాలా తక్కువ. కానీ క్వాలిటీ పరంగా ‘బాహుబలి’ ప్రమాణాల్ని అందుకోవడానికి ప్రయత్నం చేశాం. నిజానికి మా సినిమా షూటింగ్ టైంలో ఉండగా వచ్చిన ‘బాహుబలి’ని చూసి భయపడ్డాం. రెండు నెలలు షూటింగ్ ఆపేసి.. మళ్లీ కొత్తగా ప్లాన్ చేశాం. క్వాలిటీ పెంచాలని నిర్ణయించాం. ‘బాహుబలి’కి పని చేసిన టెక్నీషియన్లనే తీసుకున్నాం. మేం అనుకున్న దాని కంటే మంచి క్వాలిటీ వచ్చింది. సినిమా అంచనాల్ని అందుకుంటుందని ఆశిస్తున్నాం. మేం అనుకున్నట్లుగా ‘కాష్మోరా’ ఆడితే ‘బాహుబలి’ లాగే రెండో భాగం తీస్తాం. నా కెరీర్లో ‘కాష్మోరా’కు పడ్డ కష్టం ఇక దేనికీ పడలేదు. అయినా సినిమాకు ఆశించిన ఫలితం వస్తే ఇంకో భాగం చేయడానికి నాకు ఇబ్బందేమీ లేదు’’ అని కార్తి తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/