Begin typing your search above and press return to search.
నేను ప్రొడ్యూస్ చేయట్లేదు.. అవి రూమర్లే
By: Tupaki Desk | 18 Aug 2015 7:45 AM GMTఇకపోతే ఫిలిం ఇండస్ర్టీ అంటేనే రూమర్లు. వాటి గురించి హీరో కార్తి ఇప్పుడే తెలుసుకున్నాడో ఏంటో కాని.. తెగ ఖంగారుపడుతున్నాడు. తాను సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆగమేఘాల మీద ఖండించేశాడు. అసలు నన్నడగకుండా మీ ఇష్టం వచ్చినట్లు ఎందుకు రబ్బిష్ అంతా రాస్తున్నారని మండిపడ్డాడు. తాను నిర్మాత గా మారటమేంటి... అంటూ మ్యాటర్ ఏంటో వివరించేశాడు కుర్రాడు.
నిజానికి ఈ మధ్యనే కార్తి అన్నయ్య సూర్య ''2డి ఎంటర్ టైన్ మెంట్'' పేరుతో ఒక బ్యానర్ స్థాపించి దానిపై జ్యోతిక రీ-ఎంట్రీ ప్రాజెక్టు 36 వయధనిలే రూపొందించాడు. ఇక ఇప్పుడు కార్తి హీరోగా రూపొందుతున్న ''కాష్మోరా'' సినిమా కోసం ప్రిన్స్ ప్రొడక్షన్స్ అంటూ బ్యానర్ పేరు వినిపంచడంతో, ఇది కార్తి స్వయంగా స్థాపించాడు అంటూ న్యూస్ వచ్చింది. అయితే ఇందులో నిజం లేదని చెప్పేశాడు కార్తి.
''ప్రిన్స్ ప్రొడక్షన్స్ నాకు సంబంధించినది కాదు. సింగం 2 సినిమాను తీసిన నిర్మాతలది ఈ కంపెనీ. ఇకపోతే కాష్మోరా సినిమాను వారు రూపొందించట్లేదు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రభు రూపొందిస్తున్నారు. సో, నా కంపెనీ ఎక్కడ నుండి వచ్చింది మధ్యలో? మీరు విన్నవన్నీ రూమర్లే. అయినా నేను డైరక్టర్ అవుదాం అనుకుంటున్నా కాని నిర్మాతను అవ్వాలని అనుకోవట్లేదు'' అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. అది సంగతి.