Begin typing your search above and press return to search.

ఔను వారిద్దరు ప్రేమలో ఉన్నారు : కార్తి

By:  Tupaki Desk   |   14 Feb 2019 6:20 AM GMT
ఔను వారిద్దరు ప్రేమలో ఉన్నారు : కార్తి
X
కోలీవుడ్‌ కు చెందిన మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్స్‌ అయిన విశాల్‌ మరియు ఆర్యలు పెళ్లికి సిద్దం అయ్యారు. విశాల్‌ ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు. లవ్‌ కం అరేంజ్డ్‌ మ్యారేజ్‌ అంటూ విశాల్‌ ప్రకటించాడు. పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్‌ కాబోతుంది. మరో వైపు మరో హీరో ఆర్య మాత్రం హీరోయిన్‌ సాయేషా సైగల్‌ తో ప్రేమలో మునిగి తేలుతున్నాడు. వీరిద్దరి పెళ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. అయితే ఆ విషయమై అధికారిక ప్రకటన అయితే రాలేదు. తమిళ సినీ వర్గాల్లో ఈ విషయం అందరికి తెల్సిందే. మీడియాలో కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తున్నా కూడా వారిద్దరు స్పందించకుండా అనధికారికంగా వారి ప్రేమ విషయాన్ని ఒప్పుకున్నారు.

ఆర్యకు ఇండస్ట్రీలో కార్తి మంచి స్నేహితుడు. అదే విధంగా సాహేషా కూడా కార్తికి స్నేహితురాలు. కార్తి, సాహేషా కలిసి సినిమాలో నటించారు కూడా, తాజాగా ఆర్య, సాహేషా ప్రేమ విషయమై కార్తి క్లారిటీ ఇచ్చాడు. ఆర్య తనకు చెప్పకుండా పెళ్లి చేసుకోడు. అయినా ప్రస్తుతం ఆర్య నామాట వినడం లేదు. కేవలం ఆ ఒక్కరి మాటే వింటున్నాడు అంటూ కార్తి సరదాగా కామెంట్‌ చేశాడు. ఆ ఒక్కరు ఎవరు అనేది అందరికి తెల్సిందే. ఈ మాటతో ఆర్య సాహేషాలు ప్రేమలో ఉన్నట్లుగా కార్తి నిర్థారించాడు. త్వరలోనే ఆర్య పెళ్లి పీఠలు ఎక్కుతాడు అంటూ కార్తి సుచాయిగా చెప్పాడు.

నేడు కార్తి నటించిన 'దేవ్‌' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సందర్బంగా మీడియాతో మాట్లాడిన కార్తి తన స్నేమితులు అయిన విశాల్‌, ఆర్యల పెళ్లిల గురించి మాట్లాడాడు. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడేందుకు విశాల్‌ అస్సలు దొరకడం లేదు, హనీమూన్‌ అయిన తర్వాత అయినా దొరుకుతాడేమో చూడాలంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు కార్తి.