Begin typing your search above and press return to search.
హిందీ 'ఖైదీ'కి సూపర్ స్టార్ ఆసక్తి
By: Tupaki Desk | 11 Feb 2020 8:15 AM GMTగత సంవత్సరం కార్తీ ‘ఖైదీ’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. విభిన్నమైన నేపథ్యంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ‘ఖైదీ’ చిత్రాన్ని తెరకెక్కించాడు. తమిళంతో పాటు తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ కూడా మంచి టాక్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈమద్య కాలంలో సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలు హిందీలో రీమేక్ అవ్వడం చాలా కామన్ అయ్యింది. ఇప్పుడు ఖైదీని కూడా రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తమిళంలో ఒక మీడియం రేంజ్ హీరో అయిన కార్తీ చేసిన సినిమా కనుక బాలీవుడ్ లో కూడా మీడియం రేంజ్ హీరోతోనే చేస్తారేమో అనుకున్నారు. కాని ఖైదీ రీమేక్ పై బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఆసక్తి చూపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన పేరు ఖైదీ రీమేక్ చర్చల్లో వినిపిస్తుంది. వార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హృతిక్ రోషన్ మళ్లీ అదే స్థాయి యాక్షన్ సినిమాను చేయాలనుకుంటున్నాడు. అందుకే ఖైదీ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట.
హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ స్క్రిప్ట్ ను మార్చితే తప్పకుండా ఆయన నటిస్తాడని అంటున్నారు. ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను దక్కించుకున్న నిర్మాణ సంస్థతో గతంలో హృతిక్ రోషన్ సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడని.. ఆ ఒప్పందం ప్రకారం ఇప్పుడు ఖైదీ రీమేక్ కు ఒప్పుకునే అవకాశం ఉందంటూ బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. హృతిక్ రోషన్ ఓకే అయితే సమ్మర్ లో షూటింగ్ షురూ అయ్యే అవకాశం ఉంది.
ఒరిజినల్ వర్షన్ కు దర్శకత్వం వహించిన లోకేష్ ను అక్కడ చేయించేందుకు ప్రయత్నాలు చేశారు. కాని లోకేష్ హిందీ రీమేక్ పై ఆసక్తి చూపడం లేదట. ప్రస్తుతం విజయ్ తో ఈయన మాస్టర్ చిత్రాన్ని చేస్తున్నాడు. కనుక హిందీ ఖైదీ కోసం మరో దర్శకుడిని టీం ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతోంది. హృతిక్ ఓకే చెప్తే ఆయన చెప్పే దర్శకుడితోనే రీమేక్ చేసే అవకాశం ఉంది.