Begin typing your search above and press return to search.

అన్న ఒక్కడికే విలన్ ని చూపిస్తాడట!

By:  Tupaki Desk   |   4 Nov 2016 1:30 PM GMT
అన్న ఒక్కడికే విలన్ ని చూపిస్తాడట!
X
హీరోలు డిఫరెంట్ గెటప్పులలో.. కేరక్టర్లలో కనిపించేందుకు ఉత్సాహం చూపుతున్న రోజులివి. గతంలో ఇలాంటి ప్రయోగాలు ఒకరిద్దరు మాత్రమే చేసేవారు కానీ.. ఇప్పుడు దాదాపు అందరు ప్రతీ సినిమాలో కొత్తగా కనిపించేందుకు తాపత్రయపడుతున్నారు. రీసెంట్ గా హీరో కార్తి.. కాష్మోరా మూవీలో రాజ్ నాయక్ పాత్రతో ఆకట్టుకున్నాడు.

నెగిటివ్ షేడ్స్ ఉండే ఈ పాత్ర సినిమాకి కీలకం కాగా.. ఈ రోల్ ని కార్తి మెప్పించిన తీరు ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. నెగిటివ్ రోల్ ని ఇంత అద్భుతంగా పండించడంతో.. 'పూర్తి స్థాయి విలన్ గా ఛాన్స్ వస్తే చేస్తారా' అనే ప్రశ్న కార్తీకి ఎదురైంది. "విభిన్నమైన కేరక్టర్లు చేయడానికి సిద్ధమే అయినా.. ఫుల్ లెంగ్త్ విలన్ గా మాత్రం చేయాలని అనుకోవడం లేదు. ఇప్పటికైతే అలా ఆలోచించలేదు కూడా. కానీ అన్నయ్య సినిమాలో ఈ ఆఫర్ వస్తే మాత్రం అస్సలు వదులుకోను" అని చెప్పాడు కార్తీ.

తనలోని విలన్ కేవలం అన్నయ్య సూర్యకే అంకితం అని కార్తీ చెప్పడం ఆశ్చర్యం కలిగించేదే. కాష్మోరాలో రాజ్ నాయక్ పాత్ర చూసి సూర్య విపరీతంగా మెచ్చుకున్నాడని చెప్పిన ఈ తమ్ముడు కార్తి.. తనకే విలన్ గా చేయాలని ఉందని పైకి చెప్పేశాడు. మరి కార్తి ఇచ్చిన ఈ ఆఫర్ ని ఏ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తాడో.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/