Begin typing your search above and press return to search.
'కేజీఎఫ్' రేంజ్ లో ఉంటుందట!
By: Tupaki Desk | 3 July 2019 6:20 AM GMTకన్నడ సినిమా 'కేజీఎఫ్' ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు ఉన్న కన్నడ సినిమా రికార్డులన్నీ కూడా బద్దలు అయ్యాయి. కేవలం కన్నడంలోనే కాకుండా సౌత్ భాషలన్నింటిలో మరియు హిందీలో కూడా కేజీఎఫ్ దుమ్ము రేపింది. అద్బుత విజయాన్ని సొంతం చేసుకున్న 'కేజీఎఫ్' కు ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతుంది. కేజీఎఫ్ 2 సక్సెస్ అయితే మూడవ పార్ట్ కూడా ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పుడు కేజీఎఫ్ తరహాలోనే తమిళంలో 'మాఫియా' అనే టైటిల్ తో సినిమా రాబోతుందట.
యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్ ప్రస్తుతం 'మాఫియా' అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. అరుణ్ విజయ్ హీరోగా 'మాఫియా' చిత్రం రూపొందబోతుంది. ఈ చిత్రం ఒక పార్ట్ తో పూర్తి కాదట. 'మాఫియా' ఛాప్టర్ 1 అంటూ మొదటి పార్ట్ రానుంది. ఆ తర్వాత వరుసగా ఛాప్టర్స్ వస్తాయంటున్నారు. దర్శకుడు కార్తీక్ నరేన్ తన 21 ఏళ్ల వయసులోనే మంచి థ్రిల్లర్ మూవీ '16' ను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. కార్తీక్ నరేన్ రెండవ సినిమా కూడా థ్రిల్లర్ కథాంశంతోనే రూపొందింది. మొదటి రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
కార్తీక్ మూడవ సినిమా 'మాఫియా' కూడా థ్రిల్లర్ నేపథ్యంలోనే తెరకెక్కబోతుండటంతో పాటు భారీ బడ్జెట్ మూవీ అవ్వడం వల్ల ఇది తమిళ 'కేజీఎఫ్' అంటూ అక్కడి మీడియా కథనాలను రాస్తోంది. కేజీఎఫ్ స్థాయిలో ఈ చిత్రం ఉంటుందని.. తమిళంలోనే కాకుండా సౌత్ లో అన్ని భాషలను ఉత్తరాధిలో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లాలని భావిస్తున్నారట. కేజీఎఫ్ వంటి అద్బుతాలు అప్పుడప్పుడు మాత్రమే ఆవిష్కారం అవుతాయి. మరోసారి అలాంటి అద్బుతంను మాఫియా చిత్రంతో దర్శకుడు కార్తీక్ నరేన్ ఏమైనా సృష్టిస్తాడో చూడాలి.