Begin typing your search above and press return to search.
మన బన్నీ దారిలోనే బాలీవుడ్ యంగ్ క్రేజీ హీరో
By: Tupaki Desk | 30 Aug 2022 5:20 AM GMTసెలబ్రెటీలు ప్రస్తుతం రెండు చేతుల కాదు పది చేతుల సంపాదన పొందే అవకాశాలు ఉన్నాయి. సెలబ్రెటీలకు వారి యొక్క స్టార్ డమ్ ఆధారంగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు కోట్లల్లో పారితోషికాలు ఆఫర్ లు చేస్తున్న కంపెనీలు వందలకు వందలు ఉన్నాయి. తమ కంపెనీలకు పబ్లిసిటీ కావాలంటూ సెలబ్రెటీల వెంట పడుతున్న కంపెనీలు అన్నీ ఇన్నీ కావు.
చిన్న కంపెనీలు సోషల్ మీడియా సెలబ్రెటీలు.. టీవీ స్టార్స్ వెంట పడితే, జాతీయ స్థాయి కంపెనీలు అంతర్జాతీయ స్థాయి కంపెనీలు మాత్రం స్టార్స్ సూపర్ స్టార్స్ వెంట పడటం చాలా కామన్ విషయం. కొన్ని కంపెనీలు జనాల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ తమ ప్రాడెక్ట్స్ ను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. వాటిని కొన్ని చోట్ల బ్యాన్ చేసినా కొన్ని చోట్ల అనుమతి ఉంటుంది.
అలాంటి ప్రాడెక్ట్స్ కి ప్రమోషన్ చేసేందుకు కొందరు హీరోలు నిర్మొహమాటంగా భారీ పారితోషికం తీసుకుని ఓకే చెబుతున్నారు. కానీ కొందరు హీరోలు మాత్రం కోట్ల పారితోషికం కాదని ఆ యాడ్స్ కు నో చెబుతున్నారు. పాన్ మసాలా యాడ్స్ కు బాలీవుడ్ హీరోలు వరుసగా ఓకే చెబుతుంటే అల్లు అర్జున్ ఆ మధ్య భారీ పారితోషికం ఆఫర్ చేసినా కూడా సున్నితంగా తిరష్కరించాడు.
అల్లు అర్జున్ తో పాటు తమిళ హీరో శింబు కూడా పాన్ మసాలా యాడ్స్ కి నో చెప్పాడు. ఇప్పుడు అల్లు అర్జున్ దారిలోనే బాలీవుడ్ యంగ్ క్రేజీ హీరో కార్తిక్ అయాన్ కూడా పాన్ మసాలా యాడ్ కు నో చెప్పాడట. దాదాపుగా పది కోట్ల పారితోషికం ఇచ్చేందుకు ఆ కంపెనీ ముందుకు వచ్చిందట. అయినా కూడా పాన్ మసాలా యాడ్ లో నటించేది లేదని తెగేసి చెప్పాడట.
ఆ మధ్య కాలంలో అక్షయ్ కుమార్ పాన్ మసాలా యాడ్ లో కనిపించినందుకు గాను ఆయన్ను ఏ స్థాయిలో జనాలు ట్రోల్స్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ భయమో లేదా సామాజిక బాధ్యతో కానీ బన్నీ దారిలోనే కార్తిక్ ఆర్యన్ కూడా ఆ పాన్ మసాలా యాడ్ కు నో చెప్పి మంచి పని చేశాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.