Begin typing your search above and press return to search.

ఇక్క‌డ ఎవ‌రి అడ్డా వాళ్ల‌కు ఉంట‌ది.. ఎవ‌రూ ఎవ‌రినీ తొక్కేయ‌లేరు!

By:  Tupaki Desk   |   23 Nov 2022 3:06 PM GMT
ఇక్క‌డ ఎవ‌రి అడ్డా వాళ్ల‌కు ఉంట‌ది.. ఎవ‌రూ ఎవ‌రినీ తొక్కేయ‌లేరు!
X
చూసే దృక్కోణాన్ని బ‌ట్టి ప్ర‌తిదీ మారిపోతుంటుంది. బాలీవుడ్ లో నిరంత‌రం మారే స్నేహాలు.. వైరాలు..బ‌లాబ‌లాల ప్ర‌ద‌ర్శ‌న‌.. ప్రేమాయ‌ణాలు.. కొత్త డేటింగులు.. ఇవ‌న్నీ నైట్ పార్టీల్లోనే ఎక్కువ‌గా బ‌య‌ట‌ప‌డుతుంటాయి. ఇక బ‌ర్త్ డేలు.. మ్యారేజ్ లు.. స‌క్సెస్ పార్టీలు.. మీట్ ద గ్రీట్ కాక్ టైల్ పార్టీల వెన‌క బోలెడంత మంత్రాంగం న‌డుస్తుంటుంది. రంగుల మాయా ప్ర‌పంచంలో ఎవ‌రి బ‌లం ఎంత‌? ఎవ‌రి స‌త్తా ఎంత‌? అన్న చ‌ర్చ ఇలాంటి పార్టీల వేదిక‌గా సాగుతుంటుంది.

ఇక కాక్ టైల్ పార్టీల‌కు గురూజీగా పేరు పొందాడు ద‌ర్శ‌క‌నిర్మాత‌.. బాలీవుడ్ డీన్ క‌ర‌ణ్ జోహార్. ఊరంత పందిరి వేసి బోలెడంత హంగామాతో పార్టీ నైట్ సెల‌బ్రేట్ చేయ‌డం అత‌డి స్టైల్. బాలీవుడ్ లో బడా బాబుల‌తో పాటు.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రినీ పిలిచి మ‌రీ కాక్ టైల్ పార్టీలు చేయ‌డం త‌న స్టైల్. ఈ పార్టీల్లో మ‌త్తు చిత్తు గురించి ఎన్.సి.బి కూడా ఆరాలు తీసింది అది వేరే విష‌యం.

ఇప్పుడు క‌ర‌ణ్ జోహార్ పార్టీకి ధీటుగా కౌంట‌ర్ పార్టీ కౌంట‌ర్ క్యాంపెయిన్ మొద‌లైందన్న గుస‌గుస వినిపిస్తోంది. యువహీరో కార్తీక్ ఆర్యన్ ముంబైలో తన 32వ పుట్టినరోజును జరుపుకోవడానికి గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి బాలీవుడ్ నుంచి ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఆయుష్మాన్ ఖురానా- స‌ల్మాన్ బావ గారు ఆయుష్ శ‌ర్మ స‌హా ప‌లువురు దిగ్గ‌జాలు ఎటెండ‌య్యారు. అలాగే స‌ల్మాన్ భాయ్ రాలేక‌పోయినా అత‌డి స్నేహితుడు క‌బీర్ ఖాన్ పార్టీకి అటెండయ్యాడు. ఇందులో అనన్య పాండే- దిశా పటానీ గ్లామ‌ర్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారింది.

కార్తీక్.. తన కుటుంబ సభ్యులు.. ఇత‌ర‌ బాలీవుడ్ స్నేహితులు సహచరుల స‌మ‌క్షంలో గ్రాండ్ పార్టీని చిలౌట్ చేశాడు. భూల్ భూలయ్యా 2తో ఇప్పటివరకు తన నట జీవితంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ ఏడాది ఏకంగా నాలుగైదు భారీ చిత్రాల్లో న‌టిస్తూ క్రేజీ ఫ్రాంఛైజీల‌కు సంత‌కాలు చేస్తూ అగ్ర‌ప‌థంలోకి దూసుకుపోతున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో ఈ పార్టీ ఎంతో ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఒక‌ర‌కంగా ఈ పార్టీని క‌ర‌ణ్ జోహార్ పార్టీకి కౌంట‌ర్ పార్టీగా కూడా ముంబై ప‌రిశ్రమ గుస‌గుస‌లాడుకుంటోంది.

భూల్ భుల‌యా 2 కి ముందు క‌ర‌ణ్ కి కార్తీక్ ఆర్య‌న్ కి మ‌ధ్య విభేధాలు అంత‌ర్గ‌త ఘ‌ర్ష‌ణ‌ల గురించి తెలిసిందే. క‌ర‌ణ్ నిర్మిస్తున్న దోస్తానా 2 నుంచి కార్తీక్ ఆర్య‌న్ ని తొల‌గించ‌డ‌మే గాక‌.. అత‌డికి క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌ని ఇక‌పై త‌న‌తో సినిమాలు నిర్మించేది లేద‌ని క‌ర‌ణ్ అధికారికంగా మీడియా ముందు ప్ర‌క‌టించారు. దీంతో కార్తీక్ ఆర్య‌న్ తీవ్రంగా హ‌ర్ట‌య్యాడు. ఇది బాలీవుడ్ మాఫియా కుట్ర‌కు బ‌లి క్ర‌తువు అంటూ క్వీన్ కంగ‌న ర‌నౌత్ అప్ప‌ట్లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే క‌ర‌ణ్ తో తెగ‌తెంపుల త‌ర‌వాత కార్తీక్ ఆర్య‌న్ వ‌రుస హిట్ల‌తో స‌త్తా చాటుతున్నాడు. అక్ష‌య్ ని రీప్లేస్ చేస్తూ తెర‌కెక్కించిన సీక్వెల్ సినిమా 'భూల్ భుల‌యా 2' కార్తీక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.

ఈ విజ‌యం అత‌డిలో ఎంతో ఆత్మ‌విశ్వాసాన్ని నింపింది. క‌రణ్ ఆరోపించిన‌ట్టు నిజానికి డెడికేష‌న్ లేక‌పోతే క‌మిట్ మెంట్ లేక‌పోతే కార్తీక్ ఇంతటి అద్భుత‌మైన విజ‌యాన్ని అందుకోలేడు. కేవ‌లం అది క‌ర‌ణ్ తో త‌లెత్తిన వ్య‌క్తిగ‌త విభేధంగానే ఇప్పుడు కార్తీక్ ఆర్య‌న్ ని ప‌రిశ్ర‌మ చూస్తోంది. ఇక ఒక అడ్డా ఆదుకోనంత మాత్రాన అత‌డు బాలీవుడ్ నుంచి వెలివేయ‌బ‌డ్డ‌ట్టు కాదు. ఇక్క‌డ ఎవ‌రి అడ్డా వారికుంటుంది. ఎవ‌రికి వారు స‌త్తా చాటి రేసులో ముందుకు ఉర‌కాల్సిందే. ఇప్పుడు ఈ రేస్ లో కార్తీక్ ఆర్య‌న్ ర‌య్ మంటూ దూసుకుపోతున్నాడు. శ‌త్రువుల‌కు ప్రాక్టిక‌ల్ గా త‌న ప‌నితో స‌క్సెస్ తో స‌మాధానం చెబుతున్నాడు. మీరు అవ‌కాశాలు ఇవ్వ‌క‌పోతే మా అవ‌కాశాలు మేమే సృష్టించుకుంటాం! అని నిరూపిస్తున్నాడు.

నిజానికి కార్తీక్ ఆర్య‌న్ కి ఇప్పుడు బాలీవుడ్ మాఫియాగా పిల‌వ‌బ‌డే సినీపెద్ద‌ల‌తో అస‌లు ప‌నే లేదు. ఇక‌పోతే కార్తీక్ ఆర్య‌న్ ఇచ్చిన పార్టీలో బాలీవుడ్ సినీమాఫియా పై సూటిగా విమ‌ర్శ‌లు చేసిన మ‌రో ప్ర‌తిభావంతుడైన హీరో ఆయుష్మాన్ ఖురానా హైలైట్ అయ్యాడు. అంటే ఇక్క‌డ ఎవ‌రి అడ్డాను వాళ్లు త‌యారు చేసుకుని క‌థ‌ను ముందుకు న‌డిపించాల‌న్న‌దే దీని సారాంశం. చూసే క‌ళ్ల‌ను బ‌ట్టి స‌బ్జెక్ట్ ఇలా మారుతూనే ఉంటుంది. ఇక్క‌డ ఎవ‌రి అడ్డా వాళ్ల‌కు ఉంట‌ది.. ఎవ‌రూ ఎవ‌రినీ తొక్కేయ‌లేరు!

ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌..!

2022 కార్తీక్ ఆర్య‌న్ కి నిజంగా ప్రత్యేకమైన సంవత్సరం. మునుముందు కెరీర్ లో కొన్ని మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. ఇందులో హేరాఫేరి 3 అత‌డికి చాలా స్పెష‌ల్ కానుంది. మ‌రో రెండు భారీ సీక్వెల్స్ లోను అక్ష‌య్ కుమార్ ని రీప్లేస్ చేసే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే మునుముందు అత‌డు బాలీవుడ్ ని ఏలే ప్ర‌ముఖ అగ్ర హీరోల్లో ఒక‌డిగా స‌త్తా చాట‌నున్నాడ‌ని అర్థ‌మవుతోంది. ఇలాంటి పాజిటివిటీ ఉన్న హీరోని మాఫియాలు కూడా ఏమీ చేయ‌లేవ‌ని నిరూప‌ణ అవుతోంది.

బర్త్ డే బాయ్ ఈ పార్టీలో తన స్టైల్ కోటీన్ తో మెరిపించాడు. నైట్ పార్టీలో పూర్తిగా వైట్ అండ్ వైట్ డిజైన‌ర్ లుక్ లో మెరిసిపోయాడు. స‌క్సెస్ తెచ్చిన గ్లో అతడిలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కార్తీక్ ఆర్యన్ తో గొప్ప‌ స్నేహానుబంధాన్ని పంచుకునే ప్రముఖ యువ‌నటుడు ఆయుష్మాన్ ఖురానా ఈ వేడుకకు చాలా స్టైలిష్ గా హాజరయ్యారు. అత‌డు బ్లాక్ అండ్ గ్రే ప్రింటెడ్ షర్ట్ .. దానిపై బ్లాక్ క్రాప్డ్ జాకెట్ ధ‌రించి క‌నిపించాడు. ఇదే వేడుక‌లో అనన్య పాండే వైట్ అండ్ వైట్ బాడీకాన్ డ్రెస్ లో క‌నిపించింది.

స్నేహితుడితో కలిసి కార్తీక్ ఆర్యన్ పుట్టినరోజు వేడుకకు హాజరైన దిశా పటానీ మ‌రో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. వైట్ మినీ లుక్ లో పార్టీలో స్పెష‌ల్ గా క‌నిపించింది. మరోవైపు వాణి కపూర్ చారల బాడీకాన్ డ్రెస్ లో పార్టీలో గ్లామరస్ గా కనిపించింది. దర్శకుడు కబీర్ ఖాన్- ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా- దర్శకుడు అనీస్ బాజ్మీ- నటుడు ఆయుష్ శర్మ ఇతర ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.