Begin typing your search above and press return to search.
'నారప్ప' పెద్ద కొడుకు లుక్ విడుదల...!
By: Tupaki Desk | 5 July 2020 9:52 AM GMTవిక్టరీ వెంకటేష్ ప్రస్తుతం 'నారప్ప' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన 'అసురన్' అనే సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సురేష్ బాబు మరియు కలైపులి ఎస్.థాను వి క్రియేషన్స్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది. 'నారప్ప' భార్య సుందరమ్మగా ప్రియమణి కనిపించనుంది. 'నారప్ప'లో కథ పరంగా మధ్య వయస్కుడైన హీరో పాత్రకు ఇద్దరు కొడుకులు ఉంటారు. కాగా నారప్ప పెద్ద కొడుకు 'ముని కన్నా' పాత్రని పరిచయం చేసింది చిత్ర యూనిట్. ఈ క్యారెక్టర్ లో 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ కార్తిక్ రత్నం నటిస్తున్నారు. నేడు కార్తిక్ రత్నం పుట్టిన రోజు సందర్భంగా 'నారప్ప' నుంచి ఆయన లుక్ రిలీజ్ చేశారు.
కాగా సైకిల్ తొక్కుతూ డిఫెరెంట్ గెటప్ లో కార్తీక్ కనిపిస్తున్నాడు. 'కేరాఫ్ కంచరపాలెం'లో జోసెఫ్ గా ఆకట్టుకున్న కార్తిక్ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేలా ఉన్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన వెంకటేష్ 'నారప్ప'.. ప్రియమణి 'సుందరమ్మ' లుక్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు లేటెస్టుగా విడుదలైన కార్తిక్ లుక్ చిత్రంపై మరింత ఆసక్తి రేకిత్తించేలా చేసింది. ఇక వెంకటేష్ కెరీర్ లో 74వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం దగ్గుబాటి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ సరికొత్త సినిమాలతో అలరిస్తున్న వెంకటేష్ కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న 'నారప్ప' కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మిగతా పార్ట్ కంప్లీట్ చేసుకోనున్నది.