Begin typing your search above and press return to search.

టాలెంట్ ఒడిసి పట్టడంలో ఆయన ఘనాపాటి..!

By:  Tupaki Desk   |   26 April 2023 6:00 PM GMT
టాలెంట్ ఒడిసి పట్టడంలో ఆయన ఘనాపాటి..!
X
2015లో ఒక దర్శకుడు ఒక సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. ఆ తర్వాత అతను ఒక దర్శకుడి దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. అప్పటి నుండి అతను ఆ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తూ వచ్చాడు.

ఆ డైరెక్టర్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు. ఫైనల్ గా ఆ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చి అతన్ని మరోసారి ప్రోత్సహించాడు. ఈసారి ఆ అసిస్టెంట్ లెక్క తప్పలేదు. సినిమా సూపర్ హిట్ అందుకుంది. డైరెక్టర్ గా తన ముద్ర వేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు రీసెంట్ గా విరూపాక్షతో హిట్ అందుకున్న కార్తీక్ వర్మనే. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం భమ్ బోలేనాథ్ సినిమా చేసిన కార్తీక్ ఆ తర్వాత సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు. కానీ గురువు ప్రోత్సహించడంతో మళ్లీ సినిమా చేసి సక్సెస్ అయ్యాడు. మొదటి సినిమా పోయిన తర్వాత మరో ఛాన్స్ రాలేదు కానీ ఈసారి సాలిడ్ హిట్ కొట్టడంతో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు.

లేటెస్ట్ గా విరూపాక్ష ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో తనకు చాలా మంది నిర్మాతలు ఫోన్ చేసి సినిమా చేద్దాం రెడీ అంటున్నారు. దిల్ రాజు నుంచి కూడా కాల్ వచ్చిందని అన్నారు. సో దాదాపు నెక్స్ట్ సినిమా దిల్ రాజు బ్యానర్ లోనే ఉండే అవకాశం ఉంది.

అయినా టాలెంట్ ని ఒడిసి పట్టుకోవడంలో దిల్ రాజు తర్వాతే ఎవరైనా ఆ విషయంలో ఆయన ఘనాపాటి అంటుంటారు. రీసెంట్ గా బలగం సినిమాతో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. ఒకప్పుడు దిల్ రాజు బ్యానర్ నుంచి కంటెంట్ ఉన్న సినిమాలు బాగా వచ్చేవి ఈమధ్య అది తగ్గడంతో మళ్లీ ఆ సినిమాల మీద ఫోకస్ పెట్టాడు దిల్ రాజు.

ఈ క్రమంలో విరూపాక్ష తో హిట్ అందుకున్న కార్తీక్ తో దిల్ రాజు సినిమా చేస్తారని తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ అంటే స్టార్ హీరో కన్ఫర్మ్ అయినట్టే. మరి కార్తీక్ ఈ సారి ఏ హీరోతో ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి. విరూపాక్ష సినిమా సుకుమార్ ఎంత సపోర్ట్ గా నిలిచినా డైరెక్టర్ గా కార్తీక్ తన టాలెంట్ చూపించాడని చెప్పొచ్చు. అందుకే సినిమా ఫలితంలో సగం క్రెడిట్ సుకుమార్ ఖాతాలో పడుతున్నా డైరెక్టర్ టాలెంట్ అందరు గుర్తిస్తున్నారు.