Begin typing your search above and press return to search.

రాధ కూతురు రాణి అయ్యింది

By:  Tupaki Desk   |   11 Jun 2017 12:12 AM IST
రాధ కూతురు రాణి అయ్యింది
X
ఒకప్పటి టాప్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక మనందరికీ నాగ చైతన్య జోష్ సినిమా ద్వారా పరిచయమే కదా.. ఇప్పుడు ఈమె సినిమాలు ఏమి పెద్దగా చేయటం లేదు. రంగం - దమ్ము - బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ సినిమాలతో మెరిసిన ఈ చిన్నది.. ఇప్పుడు వేరే రూట్ చూసుకుంది.

బాహుబలి సినిమాలో దేవసేన పాత్ర మనం ఎప్పటికీ మరిచిపోలేము. ఆ పాత్ర లో అనుష్క చేసిన నటన నిజంగా కుంతల దేశ యువరాణి ఇంత ఠీవిగా అందంగా ఉంటుందా అని అందరికీ ఆశ్చర్యపరిచేలా నటించి మెప్పించింది. ఇప్పుడు ఇదే పాత్రను ‘ఆరంభ్‌’ అనే సీరియల్ లోకి మలిచి.. వేరే కథతో తీస్తున్నారు. అంతా గొప్పగా చెప్పుకునేలా ఆ సినిమాకు కథ రాసిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ సీరియల్ రచయిత. ఈ ‘ఆరంభ్‌’ తో తన హిందీ సీరియల్‌ కెరియర్ స్టార్ట్ చేస్తోంది కార్తీక. ఆ సీరియల్ తాలూకు టీజర్లు.. కార్తీక ఫోటోలు ఇప్పుడు నెట్లో బాగానే హల్చల్ చేస్తున్నాయి.

''కిందటి ఏడాది ఈ అవకాశం వచ్చింది. ఈ సీరియల్ దర్శకుడు గోల్డీ బెహల్ కథ చెప్పిన విధానం నా పాత్ర నిడివి ఆ పాత్ర గొప్పతనం అంతా నాకు నచ్చి ఒకే చెప్పాను. దీని కోసం నేను చాలా సినిమాలు కూడా వదులుకొన్నాను'' అంటోంది కార్తీక. ''అన్నింటికి మించి విజయేంద్రప్రసాద్‌ రాస్తున్నారు అని తెలిసిన వెంటనే యెస్ చెప్పేశాను. సినిమాలో దేవసేన గురించి చెప్పవలిసింది చాల మిగిలి ఉంది. అవన్నీ ఈ సీరియల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం'' అని ముగించింది.

ఈ సీరియల్ ను డైరెక్ట్ చేస్తున్న గోల్డీ బెహన్‌ ఇంతకు ముందు అభిషేక్ బచ్చన్ తో ద్రోణ అనే హింది సినిమా తీశాడుకాని అది అంతగా ఆడలేదు అప్పటిలో. ఇప్పుడు మళ్ళీ తన విజన్ ను బుల్లి తెర పై ఆవిష్కరించడానికి సిద్దపడ్డారు. ఇతగాడు మాజీ హీరోయిన్ సోనాలి బింద్రే మొగుడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/