Begin typing your search above and press return to search.

చైతు ఫస్ట్ లవర్ సినిమాలకు గుడ్ బై?

By:  Tupaki Desk   |   12 July 2016 7:56 AM GMT
చైతు ఫస్ట్ లవర్ సినిమాలకు గుడ్ బై?
X
అక్కినేని నాగచైతన్య హీరోగా అరంగేట్రం చేసిన మూవీ జోష్. ఏడేళ్ల క్రితం ఇదే సినిమాతో మాజీ హీరోయిన్ రాధ కూతురు కార్తీకా నాయర్ కూడా సినీ రంగ ప్రవేశం చేసింది. ఇప్పుడీ భామకు పెద్దగా అవకాశాలు లేవు. అటు తెలుగు.. అటు తమిళ సినిమాల్లో బాగానే ప్రయత్నించింది. మొత్తం కెరీర్ లో రంగం మూవీ ఒకటే.. రెండు భాషల్లోనూ మంచి సక్సెస్ సాధించింది.

తెలుగులో ఎన్టీఆర్ సరసన దమ్ములో కూడా నటించినా.. పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చినవేమీ ఈమెకు నచ్చలేదు. దీంతో సినిమాలకు దూరమవ్వాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. నరేష్ కి చెల్లిగా నటించిన బ్రదర్ ఆఫ్ బొమ్మాళినే తెలుగులో ఈమెకు లాస్ట్ సినిమా. తమిళ్ లో నటించిన వా డీల్ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే.. ఈ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేయనుందని తెలుస్తోంది. ఇప్పుడీమెకు హిందీ సీరియల్స్ లో వరుసగా అవకాశాలు వస్తుండడంతో.. వాటికే పరిమితం అవ్వాలని అనుకుంటోందట.

అయితే.. సినిమా రంగం ఈమెకు ఫైనల్ కాదు. కార్తీక ఓ స్కూల్ నడుపుతోంది. మరోవైపు యూడీఎస్ అనే సంస్థకు డైరెక్టర్. రిసార్టులు - హోటల్స్ రంగంలో ఈ కంపెనీకి మంచి పేరే ఉంది. అంటే ఇకపై కార్తీక కనిపిస్తే హిందీ సీరియల్స్ లో కనిపిస్తుంది.. లేదంటే బిజినెస్ ఉమన్ గా సెటిల్ అయిపోతుంది. ఇప్పటికే కార్తీక మిలియనీర్ బిజినెస్ ఉమన్ లెండి.