Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ వ‌ద్ద కార్తికేయ‌-2 దుమారం!

By:  Tupaki Desk   |   21 Aug 2022 11:57 AM GMT
బాక్సాఫీస్ వ‌ద్ద కార్తికేయ‌-2 దుమారం!
X
థియేట‌ర్ల‌కి జ‌నాలు రావ‌డంలేద‌ని? బెంబేలెత్తిపోయిన నిర్మాత‌ల‌కి ఇప్పుడా బెంగ తీరిపోయింది. `సీతారామం`.. `బింబిసార‌`..`కార్తికేయ‌-2` లాంటి చిత్రాల థియేట‌ర్లు జ‌నాల‌తో క‌ళ‌కళ‌లాడుతున్నాయి. ఇక `కార్తికేయ‌-2` హిందీ బెల్ట్ లో సైతం దూసుకుపోవ‌డంతో నిర్మాత‌ల్లో మ‌రింత కాన్పిడెన్స్ బిల్డ్ అయింది. కంటెంట్ ఉన్న సినిమాలు నిర్మిస్తే జ‌నాలు డైవ‌ర్ట్ అవ‌ర‌ని ఓ క్లారిటీ వ‌చ్చింది.

వ‌సూళ్ల ప‌రంగా కార్తికేయ -2 దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ ని ఓ రేంజ్ లో మోత మోగిస్తోంది. హిందీలో స‌ర‌దాగా 50 థియేట‌ర్లలో రిలీజ్ అయిన అదే సినిమా నేడు నార్త్ స్టేట్స్ అన్ని థియేట‌ర్ల‌ని కబ్జా చేసింది. దాదాపు 1000 థియేట‌ర్ల‌కు పైగా ఆక్యుపై చేసిన‌ట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సినిమాల్ని సైతం త‌ల‌ద‌న్ని తెలుగు సినిమా ఉత్త‌రాదిన దుమ్ముదులిపేస్తున్న‌ట్లు లెక్కే.

ఇది నిజంగా హిస్ట‌రీ అనే చెప్పాలి. చిన్న‌గా రిలీజ్ అయి ఈ స్థాయిలో థియేట‌ర్ ఆక్యుపెన్సీ పెంచుకోవ‌డం అంటే? చిన్న‌ విష‌యం కాదు. సినిమాలో స‌త్తా ఉంటేనే అది సాద్యం. `కార్తికేయ‌-2` విష్ణుత‌త్వాన్ని బేస్ చేసుకున్న సినిమా కావ‌డమే అక్క‌డ స‌క్సెస్ అవ్వ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా చెప్పొచ్చు. ఒక్క హిందీ వెర్ష‌న్ లోనే ఇప్ప‌టివ‌ర‌కూ 8 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టింది.

మొద‌టి వారం ముగిసే స‌రికి 50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. వ‌ర‌ల్డ్ వైడ్ వారం రోజుల షేర్ 26 కోట్ల వ‌ర‌కూ వ‌చ్చింది. తెలుగు రాష్ర్టాల్లో తొలి 18 కోట్లు షేర్ ..30 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసింది. నైజాం షేర్ 6.5 కోట్లు కాగా..సీడెడ్ 2.75 కోట్లు తెచ్చింది. ఆంధ్రాల్లో మిగ‌తా ఏరియాల‌న్ని క‌లుపుకుంటే 8.65 కోట్లు షేర్ వ‌చ్చింది.

ఇక అమెరికాలో హాఫ్ మిలియ‌న్ మార్క్ ని ట‌చ్ చేసింది. స్టిల్ థియేట‌ర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. హిందీ నుంచి వ‌సూళ్లు పెరిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో 100 కోట్ల‌కు రీచ్ అయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కులు 14 కోట్ల‌కు అమ్ముడు పోయింది. తొలి వారంలోనే రెట్టింపు షేర్ రాబ‌ట్టింది. అంటే సినిమా అప్ప‌టికే డ‌బుల్ ప్రాఫిట్ లో కి వెళ్లిపోయింది.