Begin typing your search above and press return to search.
తగ్గేదేలే అంటున్న 'కార్తికేయ 2' బాక్సాఫీస్ జోరు
By: Tupaki Desk | 31 Aug 2022 2:30 AM GMTనిఖిల్ సిద్ధార్థ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఆధ్యాత్మిక అడ్వెంచర్ థ్రిల్లర్ `కార్తికేయ 2` ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. టికెట్ విండోస్ వద్ద ఈ మూవీ రిజల్ట్ అద్భుతంగా ఉంది. కలెక్షన్లతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులు రాజకీయ నాయకుల నుండి ఈ చిత్రం ప్రశంసలు అందుకుంటోంది.
తాజాగా ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ వద్ద నిన్న ఒక్కరోజు దాదాపు 68 లక్షలు కొల్లగొట్టింది. దీంతో నార్త్ ఇండియన్ బెల్ట్ నుంచి ఈ సినిమా టోటల్ కలెక్షన్ 24.21 కోట్లకు చేరుకున్నాయి. బ్రహ్మాస్త్ర విడుదలయ్యే వరకు ఈ తెలుగు సినిమాకు వీలైనంత ఎక్కువ వసూళ్లు రాబట్టే ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు. ట్రెండ్ ను బట్టి చూస్తే ఈ సినిమా ఫుల్ రన్ లో 30 కోట్ల మార్క్ ను చేరుకునే అవకాశం ఉంది.
చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారకా నగరం శ్రీకృష్ణుడి చుట్టూ తిరుగుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ -అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. అనుపమ్ ఖేర్- శ్రీనివాస రెడ్డి- వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు.
నిఖిల్ కి తొలి 100 కోట్ల క్లబ్
కేవలం హిందీ లో 30కోట్ల క్లబ్ ని చేరుకుంటున్న కార్తికేయ 2 చిత్రం తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లోనూ అద్భుత వసూళ్లను సాధించింది. ఓవరాల్ గా అన్నిచోట్లా కలుపుకుని 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిందని కథనాలొస్తున్నాయి. నిఖిల్ కి ఈ చిత్రం తొలి 100 కోట్ల క్లబ్ చిత్రంగా నిలవనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.