Begin typing your search above and press return to search.

అమెరికాలో కార్తికేయ‌-2 అర్ధ శ‌త‌దినోత్స‌వ‌ వేడుక‌లు!

By:  Tupaki Desk   |   30 Sep 2022 12:07 PM GMT
అమెరికాలో కార్తికేయ‌-2 అర్ధ శ‌త‌దినోత్స‌వ‌ వేడుక‌లు!
X
యంగ్ హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `కార్తికేయ‌-2` పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయిన కార్తికేయ‌2 బంప‌ర్ విజ‌యాన్ని అందుకుంది. హిందీ బాక్సాఫీస్ ని వ‌సూళ్ల‌తో ఊపిరాడ‌కుండా చేసింది. 50 థియేట‌ర్లో రిలీజ్ అయిన సినిమా డేబైడే థియేట‌ర్ సంఖ్య పెంచుకుంటూ పోయింది.

కృష్ణ‌తత్వం బాక్సాఫీస్ వ‌ద్ద మ్యాజిక్ నెంబ‌ర్ ని సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించింది. ఇక ఓవ‌ర్సీస్ లోనూ కార్తికేయ‌-2 త‌డాఖా చూపించింది. అక్క‌డా అనూహ్యా వ‌సూళ్ల‌తో విజ‌య‌దుందుబీ మోగించింది. USAలో 2 మిలియన్ డాలర్లకు పైగా వ‌సూళ్లు సాధించింది. ఇటీవలే ఈ చిత్రం విజయవంతంగా 50 రోజుల రన్‌ను పూర్తి చేసుకుంది.

ఓవర్సీస్ లో రెడ్ హార్ట్ మూవీస్ చిత్రాన్ని రిలీజ్ చేసింది. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు సంస్థ భారీ ఎత్తున అర్ధ‌శ‌త దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించింది. ఈ వేడుకలకు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ హాజరై సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమా అమెరికాలో ఇంత గొప్ప విజ‌యం సాధించ‌డం పట్ల‌ సంతోషాన్ని వ్య‌క్తం చేసారు.

ఓవ‌ర్సీస్ లో ఇలాంటి వేడుక‌లు చాలా రేర్. సినిమా పెద్ద హిట్ అయి..పంపిణీదారుల‌కు భారీ లాభాలు వస్తే త‌ప్ప ఇలాంటి వేడుక‌లు నిర్వ‌హించరు. అలా నిర్వ‌హించారంటే పంపిణీదారులు ఊహించిన దానికంటే అధిక లాభాలు తెస్తేనే ఇలాంటి వేడుక‌లకి ఆస్కారం ఉంటుంది. ఆ కోవ‌లో కార్తికేయ‌-2 నిల‌వ‌డం విశేషం. ఈసినిమాలో న‌టించిన నిఖిల్ స‌హా అనుప‌మ ప‌ర‌మ‌వేశ్వ‌ర‌న్ ఇత‌ర న‌టీన‌టుల‌కు మంచి పేరొచ్చింది.

2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా `కార్తికేయ 2` తెర‌కెక్కింది.చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని TG విశ్వ ప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. రెండు భాగాలు స‌క్సెస్ అయిన నేపథ్యంలో కార్తికేయ‌-3కి రంగం సిద్దం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని అంత‌ర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ ప్రారంభించి పూర్తిచేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే విష‌యాన్ని నిఖిల్..చందు మొండేటి అధికారికంగా ప్ర క‌టించిన సంగ‌తి తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.