Begin typing your search above and press return to search.
మలయాళంలో రిలీజ్ కు రెడీ అయిన రీసెంట్ బ్లాక్ బస్టర్..!
By: Tupaki Desk | 10 Sep 2022 6:22 AM GMTనిఖిల్ సిద్ధార్థ్ మరియు అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ''కార్తికేయ 2''. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ గా నిలిచింది. ఇప్పటి వరకు రూ. 120 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి సంచలనం సృష్టించింది.
2014లో నిఖిల్ - చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్ గా ''కార్తికేయ 2'' తెరకెక్కింది. ఆగస్టు 13న తెలుగుతో పాటుగా హిందీలోనూ విడుదల చేశారు. అయితే నార్త్ బెల్ట్ లో ఎవరూ ఊహించని విధంగా అద్భుత విజయం సాధించింది.
హిందీలో తొలి రోజు 50 స్క్రీన్స్ లో మాత్రమే విడుదలైన 'కార్తికేయ 2'.. మౌత్ టాక్ బాగుండటంతో స్క్రీన్స్ పెంచుకుంటూ పోయారు. దీంతో నాలుగు వారాల థియేట్రికల్ రన్ లో దాదాపు రూ. 30 కోట్ల వరకూ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.
తెలుగు హిందీ భాషల్లో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు 'కార్తికేయ 2' చిత్రాన్ని ఇతర భాషల్లోకి తీసుకెళ్లడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ముందుగా మలయాళ వెర్షన్ ను సెప్టెంబర్ 23న కేరళ అంతటా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. E4 ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ సంస్థ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.
ఈ మేరకు హీరోయిన్ అనుపమ ట్వీట్ చేస్తూ.. మలయాళ వెర్షన్ రిలీజ్ పోస్టర్ ను షేర్ చేసింది. ''హలో మలయాళం మూవీ లవర్స్... మా చిత్రం #కార్తికేయ2 కేరళ వ్యాప్తంగా మలయాళంలో ఈ సెప్టెంబర్ 23న థియేటర్లలో భారీగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మలయాళ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లినందుకు E4 మూవీస్ కి ధన్యవాదాలు'' అని మలయాళ బ్యూటీ ట్వీట్ లో పేర్కొంది.
మాలీవుడ్ కు చెందిన అనుపమ పరమేశ్వరన్ కు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇది 'కార్తికేయ 2' సినిమా విజయానికి దోహదపడే అవకాశం ఉంది. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ - శ్రీనివాస రెడ్డి - ఆదిత్యా మీనన్ - వైవా హర్ష - తులసి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభోట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కాల భైరవ సంగీతం సమకూర్చగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
శ్రీ కృష్ణుడి నేపథ్యంలో చరిత్ర మరియు పురాణాల గురించి తెలియజేసే యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో అన్ని భాషల ప్రేక్షకులు 'కార్తికేయ 2' సినిమాకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అద్భుతమైన విజువల్స్ - అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి. మరి తెలుగు హిందీ భాషల్లో ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా.. మలయాళంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందో లేదో వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.