Begin typing your search above and press return to search.

కార్తికేయ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. నిఖిల్ కెరీర్ బెస్ట్

By:  Tupaki Desk   |   20 Aug 2022 9:20 AM GMT
కార్తికేయ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. నిఖిల్ కెరీర్ బెస్ట్
X
నిఖిల్ సిద్దార్థ్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 సినిమా ఆగస్టు 13వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ దిశగా కొనసాగుతోంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసి నిఖిల్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ గా కార్తికేయ 2 నిలిచింది. ఈ సినిమా విడుదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

దర్శకుడు చందు మొండేటి 2014లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వల్ గా ఈ సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. ఇక మిగతా సినిమాల వలన కొన్నిసార్లు వాయిదా పడినప్పటికీ ఎట్టకేలకు నిఖిల్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ రోజురోజుకు మరింత పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా హిందీలో కూడా ఈ సినిమా ఊహించని వేధిలో కలెక్షన్స్ అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇక థియేటర్లోకి వచ్చి ఈ సినిమా వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఒక ప్రత్యేకమైన పోస్టర్ ద్వారా తెలియజేశారు.

ఇక ఇప్పటికే హిందీలో ఈ సినిమాకు సంబంధించిన షోలను కూడా పెంచుతూ ఉండడం విశేషం. మొదట ఒక 50 షోలను ప్రదర్శించాలని అనుకున్న నిర్మాతలు ఆ తర్వాత హిందీలో ఏకంగా వెయ్యికి పైగా షోలను ప్రదర్శించడం విశేషం.

రెండు మూడు రోజుల్లోనే కార్తికేయ 2 సినిమాకు నార్త్ ఇండస్ట్రీలో బాగా హైప్ పెరిగిపోయింది. ఇక కృష్ణాష్టమి తో పాటు ఈ వీకెండ్ కూడా సినిమాకు మరిన్ని కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. హాలిడేస్ లేని సమయంలోనే ఈ సినిమాకు కోటికి పైగా షేర్ వసూళ్లు వస్తున్నాయి.

ఇక శని ఆదివారాల్లో కలెక్షన్స్ అయితే మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. మొత్తంగా కార్తికేయ 2 సినిమాతోనే ఒక బిగ్గెస్ట్ సక్సెస్ చూస్తున్నాడు. మరి ఈ నెంబర్లు ఎంతవరకు వెళ్తాయో చూడాలి.