Begin typing your search above and press return to search.
‘కార్తికేయ 2’ కు గుజరాత్ సీఎం ప్రశంసలు..!
By: Tupaki Desk | 29 Aug 2022 3:40 PM GMTటాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన ''కార్తికేయ 2'' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు ఈ మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.
'కార్తికేయ 2' సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిన్న సినిమాగా ప్రారంభమై పెద్ద సినిమా రేంజ్ లో ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా నార్త్ సర్క్యూట్స్ లో ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 24 కోట్లకు పైగా వసూళ్లతో మూడో వారంలోనూ అక్కడ సూపర్ స్ట్రాంగ్ గా నిలబడింది.
శ్రీ కృష్ణుడి నేపథ్యంలో చరిత్ర మరియు పురాణాల గురించి తెలియజేసే యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో అన్ని భాషల ఆడియన్స్ 'కార్తికేయ 2' సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలోని అద్భుతమైన విజువల్స్ మరియు అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు 'కార్తికేయ 2' సినిమా చూసి ప్రశంసించారు. తాజాగా ఈ సినిమా చూసిన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్.. చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంత మంచి సందేశాన్ని దేశమంతా చూపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్తికేయ-2 లాంటి సినిమాలు మరెన్నో రావాలని భూపేంద్ర భాయ్ మనస్పూర్తిగా కోరుకున్నారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మరియు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రత్యేకంగా గుజరాత్ సీఎం ని కలిసారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాగా, నిఖిల్ మరియు చందు మొండేటి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్ గా ''కార్తికేయ 2'' తెరకెక్కింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ - శ్రీనివాస రెడ్డి - ఆదిత్యా మీనన్ - వైవా హర్ష - తులసి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభోట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కాల భైరవ సంగీతం సమకూర్చగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
పాన్ ఇండియా స్థాయిలో 'కార్తికేయ 2' చిత్రం సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ''కార్తికేయ 3'' సినిమా కూడా రూపొందించనున్నట్లు దర్శకుడు ప్రకటించారు. దీనికి అనుగుణంగానే రెండో భాగంలో లీడ్ వదిలారు. మరి మూడో పార్ట్ లో ఎలాంటి ఆసక్తికరమైన కథను చూపిస్తారో.. ఎలాంటి మిస్టరీని చేదిస్తారో వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.