Begin typing your search above and press return to search.
కార్తికేయని వదలరు..వాళ్ల కాన్పిడెన్స్ అదే!
By: Tupaki Desk | 23 Aug 2022 11:32 AM GMTనిఖిల్-చందు మొండేటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ కాంబోలో తెరకెక్కిన కార్తికేయ..కార్తికేయ2 భారీ విజయాలు నమోదు చేసారు. మొదటి భాగాన్ని మించి కార్తికేయ-2 బ్లాక్ బస్టర్ అయింది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన సినిమా హిందీ బెల్ట్ లో సునామీ వసూళ్లు సాధిస్తుంది. ఇప్పటికే 75 కోట్ల వసూళ్లని సాధించింది.
ఇందులో బాలీవుడ్ నుంచి భారీ షేర్ ఉంది. తాజా ఊపులో సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. నార్త్ నుంచి అనూహ్య స్పందన ఊహించనది. అక్కడ ఇంత పెద్ద సక్సెస్ సాధిస్తుందని ఏమాత్రం గెస్ చేయలేదు.
తెలుగు రాష్ర్టాల్ని మించి దూసుకుపోతుంది. శివతత్వం అక్కడ బాగానే వర్కౌట్ అయింది. ఇస్కాన్ లాంటి ప్రఖ్యాత సంస్థల ప్రశంసలు పొందిన చిత్రంగా నిలిచిందంటే? కార్తికేయ రేంజ్ ని అర్దం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో కార్తికేయ ప్రాంచైజీని సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అంత వీజిగా వదిలే ఛాన్స్ లేదు. ఇప్పటికే కార్తికేయ3ని అంతర్జాయతీ స్థాయిలో తెరకెక్కిస్తామని రిలీజ్ కి ముందే ప్రకటించారు. తాజా సక్సెస నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో తదుపరి భాగాన్ని తెరకెక్కించనున్నారని చెప్పొచ్చు. మూడవ భాగం స్పాన్ ని మరింత పెంచే అవకాశం ఉంది.
అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి కాబట్టి వాటిని అందుకునేలా? ఆడియన్ ఊహకందని విధంగా చిత్రాన్ని తెరకెక్కించాలి. అది సుసాధ్యం చేయగల ద్వయమే అది. అంతటి ప్రతిభావంతులు కాబట్టే యూనిక్ ఐడియాలీజీతో ముందుకెళ్తున్నారు. `సమాధానం లేని ప్రశ్నే ఉండదు. అలా ఉంటే అది ప్రశ్నే కాదు` అన్న పాయింట్ కి థ్రిల్లర్ బేస్ ఉన్న అంశాన్ని తీసుకుని అద్భుతంగా మలుస్తున్నారు.
అలాంటి మిస్టరీ అంశాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ప్రతీ దేవాలయం వెనుక ఎంతో తెలుసుకోవాల్సిన చరిత్ర ఉంది. అలాంటివన్నీ చందు మొండేటి తన కథా వస్తువుగా మలుచుకునే ఛాన్స్ ఉంది. ఆ కాన్పిడెన్స్ తోనే కార్తికేయ ప్రాంచైజీ నుంచి మరిన్ని చిత్రాలు వస్తాయని ఇటీవల నిఖిల్ ఓ సందర్భంలో అన్నారు. ఈ ప్రాంచైజీ కొనసాగినంత కాలం నిఖిల్ మాత్రమే హీరోగా కొనసాగుతాడా? లేక బాలీవుడ్ తరహాలో హీరోల్ని రీప్లేస్ చేస్తారా? అన్నది అప్పటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.