Begin typing your search above and press return to search.

కార్తికేయ 2 ట్రైలర్‌ అప్‌డేట్‌

By:  Tupaki Desk   |   2 Aug 2022 8:39 AM GMT
కార్తికేయ 2 ట్రైలర్‌ అప్‌డేట్‌
X
నిఖిల్‌ హీరోగా అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్ గా తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా ఆగస్టు 12వ తారీకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. కార్తికేయ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సహజంగానే సీక్వెల్‌ పై జనాల్లో ఆసక్తి భారీగా ఉంటుంది. కార్తికేయ 2 మొదటి పార్ట్‌ తో పోల్చితే మరింత ఆసక్తికరంగా.. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని మేకర్స్ చెబుతూ వచ్చారు.

సినిమాను చాలా యాక్టివ్‌ గా ప్రమోట్‌ చేయడంలో చిత్ర యూనిట్ సభ్యులు సఫలం అయ్యారు. ఇప్పటికే వరుసగా సినిమాలు వస్తున్నా కూడా కార్తికేయ 2 కోసం జనాలు ఎదురు చూసే విధంగా నిఖిల్ అండ్ టీమ్‌ ప్రచారం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇస్కాన్ టెంపుల్‌ కు వెళ్లడం మరియు బాలీవుడ్‌ స్టార్‌ అనుపమ్ ఖేర్ ను కలవడం వంటివి చేశారు.

కార్తికేయ 2 సినిమా స్థాయిని మరింత పెంచేందుకు గాను ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ ను ఆగస్టు 6వ తారీకున విడుదల చేయబోతున్నారు. ట్రైలర్‌ విడుదల కార్యక్రమంను హంగామాగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సినిమా ట్రైలర్‌ వచ్చిన తర్వాత అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయం అన్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

దర్శకుడు చందు మొండేటి కార్తికేయ 2 ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించాడు. ఆయన కథ విషయంలో చాలా వర్కౌట్‌ చేశారు. ఎన్నో రీసెర్చ్‌ లు కూడా నిర్వహించారని సమాచారం.

కార్తికేయ 2 సినిమా ఒక సింపుల్‌ థ్రిల్లర్ సినిమా కాదని.. ఇది ఒక అద్భుతం అన్నట్లుగా ఉంటుందని మేకర్స్‌ మరియు యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ సినిమా లో మొదటి కార్తికేయ లో నటించిన స్వాతి రెడ్డి కీలక పాత్రలో కనిపించబోతుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఆ విషయాన్ని అధికారికంగా రివీల్‌ చేయలేదు. స్వాతి పాత్రను సస్పెన్స్ గా ఉంచడం ద్వారా విడుదల సమయంలో సినిమా పై ఆసక్తి కలిగించబోతున్నారని తెలుస్తోంది. నిఖిల్‌ మరియు అనుపమ పరమేశ్వరన్‌ కాంబో సన్నివేశాలు కార్తికేయ 2 లో బాగుంటాయని మేకర్స్ చెబుతున్నారు.