Begin typing your search above and press return to search.

విలన్ గా అజిత్ ముందుకు వెళ్లడానికి టెన్షన్ పడ్డాను!

By:  Tupaki Desk   |   9 Nov 2021 5:30 AM GMT
విలన్ గా అజిత్ ముందుకు వెళ్లడానికి టెన్షన్ పడ్డాను!
X
కార్తికేయ తెలుగులో హీరోగా చేస్తూనే తమిళంలో 'వలిమై' సినిమాలో అజిత్ తో తలపడే పవర్ఫుల్ విలన్ పాత్రలో చేశాడు.

ఇక్కడ 'రాజా విక్రమార్క' చేస్తూనే, అక్కడ 'వలిమై' సినిమా చేస్తూ వచ్చాడు. తాజాగా 'రాజా విక్రమార్క' ప్రమోషన్స్ సమయంలో 'వలిమై' ప్రస్తావన రావడంతో, ఆయన ఆ సినిమాను గురించి చెప్పాడు. 'వలిమై' ఫస్టు డే నేను సెట్ కి వెళ్లినప్పుడు నా పాత్ర కి సంబంధించిన విషాలను గురించి దర్శకుడు వినోద్ అంతా చెప్పాడు. రెండో రోజున సెట్ కి అజిత్ వచ్చారు. ఆయన వస్తున్నాడని తెలియాగానే నాలో టెన్షన్ మొదలైంది.

అక్కడ ఆయన పెద్ద స్టార్ .. నాకు తమిళం అంతగా తెలియదు .. ఎలా బిహేవ్ చేయాలో .. ఏమో అనుకున్నాను. కానీ ఆయన వస్తూనే అందరినీ చాలా ఆత్మీయంగా పలకరించారు. సెట్లో ఆయన అందరినీ సమానంగా చూస్తారు. 'ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు కదా .. అంతా బాగుంది కదా' అని ఆయన తరచూ అడిగేవారు. దాంతో ఆయనతో కలిసి నటించడానికి నాకు మంచి కంఫర్ట్ గా అనిపించేది. నేను ఆ పాత్రను అంతమంచిగా చేయడానికి కారణం ఆయనే. నాకు తమిళం రాదు .. ఈ సినిమా ఓకే అనుకున్న తరువాత తమిళం తెలిసిన వాళ్లతో మాట్లాడటం .. తమిళ సినిమాలు ఎక్కువగా చూడటం చేశాను.

అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నది అర్ధమయ్యే స్థాయికి నేను తమిళం నేర్చుకున్నాను. ఎందుకంటే అసలు భాష తెలియకుండా యాక్ట్ చేయడం చాలా కష్టం. 'రాజా విక్రమార్క' విషయానికి వస్తే, నేను ఇంతకుముందు యాక్షన్ సీన్స్ చేసి ఉన్నాను .. కానీ కామెడీ సీన్స్ ఎక్కువగా చేయలేదు. అందువలన నా కామెడీని ఎంతవరకూ రిసీవ్ చేసుకుంటారనే ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. బయట నేను చాలా జోవియల్ గా ఉంటాను .. కెమెరా ముందు కూడా అలాగే చేయి అని డైరెక్టర్ గారు చెప్పారు .. అలాగే చేశాను. ట్రైలర్ చూసిన తరువాత కామెడీ బిట్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

గతంలో ఫలానా టైప్ ఆడియన్స్ కోసమని .. మార్కెట్ కోసమని .. పెద్ద బ్యానర్ కదా అని కొన్ని సినిమాలు చేశాను. అలా అనుకుని చేసిన ఏ సినిమా హిట్ కాలేదు. ఈ సినిమాతో స్టార్ అవుతామా? రాజమౌళిగారితో ఎప్పుడు చేయాలి? అనే ఆలోచనలు పక్కన పెట్టేయాలి. ఏ సినిమాకి ఆ సినిమావరకే ఆలోచించాలి. కథను ఒక హీరోలా కాకుండా ఒక ఆడియన్ గా వినాలి .. కథ నచ్చితే చేయాలి .. లేదంటే లేదు అంతే అనే ఒక నిర్ణయానికి వచ్చేశాను. కథాకథనాలు నచ్చితే .. ఇంకా ఏయే జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుస్తుంది. అలా జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్రతి సినిమా హిట్ కాకపోయినా, కనీసం ఒక మంచి సినిమాగా మిగులుతుంది" అని చెప్పుకొచ్చాడు.