Begin typing your search above and press return to search.
`గుణ 369` స్టామినా ఎంతో తేలాలి
By: Tupaki Desk | 1 Aug 2019 9:11 AM GMTతొలి సినిమా బ్లాక్ బస్టర్. మలి సినిమా ఫ్లాప్. బ్లాక్ బస్టర్ ఆనందం మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. రెండో ప్రయత్నం ఫెయిలవ్వడం ఇబ్బంది పెట్టింది. అయినా మూడో సినిమాతో హిట్టు కొడతానన్న ధీమాను కనబరుస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇంతకీ ఎవరా హీరో? అంటే ఆర్ ఎక్స్ 100 ఫేం కార్తికేయనే. అతడు నటించిన ఆర్ ఎక్స్ 100 బ్లాక్ బస్టర్ అయినా ఆ సక్సెస్ ను రెండో సినిమాతో నిలబెట్టలేక తడబడ్డాడు. దిగ్గజాలతో కలిసి హిప్పీ చిత్రం చేసినా అది ఫ్లాపవ్వడం నిరాశ పర్చింది. ప్రస్తుతం `గుణ 369` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమా అతడి ఆశల్ని నెరవేరుస్తుందా? నటించే ప్రతి సినిమా తొలి సినిమాతో సమానం. ప్రతిదీ హిట్టు కొట్టాలి ఇక్కడ. లేదంటే ఎంత పెద్ద హీరోకి అయినా కష్టమే. మరి ఈ డెబ్యూ హీరో సన్నివేశమేంటో? అన్న ముచ్చట ఫిలింసర్కిల్స్ ని.. ట్రేడ్ వర్గాల్ని టెన్షన్ కి గురి చేస్తోంది. తాజాగా గుణ 369 ప్రీబిజినెస్ వివరం తెలిసింది.
`గుణ 369` చిత్రాన్ని 9 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. సుమారు 5.75 కోట్ల మేర నాన్ థియేట్రికల్ బిజినెస్ చేశారట ఇప్పటికి. థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల మేర జరిగిందని అంచనా వెలువడింది. ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ .. థియేట్రికల్ కలిపి 12 కోట్ల మేర బిజినెస్ సాగించారట. ఈ చిత్రాన్ని నైజాంలో ఇస్మార్ట్ శంకర్ పంపిణీ వర్గాలు చేజిక్కించుకుని రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. గుణ 369 డిజిటల్ హక్కుల్ని ప్రఖ్యాత ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ 3కోట్లకు చేజిక్కించుకోగా.. హిందీ రైట్స్ కి ప్రఖ్యాత నిర్మాణ సంస్థ 2.75 కోట్లకు ఒప్పందం చేసుకుందన్న ప్రచారం ఉంది. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్.ఎక్స్ 100 చిత్రం పెట్టుబడి కంటే ఏడెనిమిది రెట్టు అధికంగా వసూలు చేసింది. గుణ 369 చిత్రం 10 కోట్లు పైగా షేర్ తెస్తుందా.. లేదా? అన్న చర్చ ట్రేడ్ వర్గాల్లో సాగుతోంది.