Begin typing your search above and press return to search.
అప్పట్లో సిద్ధార్థ్ ను చాలాసార్లు తిట్టుకునేవాడిని: హీరో కార్తికేయ
By: Tupaki Desk | 10 Oct 2021 3:30 PM GMTహీరో కార్తికేయకి 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో ఫస్టు హిట్ ఇచ్చింది దర్శకుడు అజయ్ భూపతి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. నిన్న జరిగిన 'మహా సముద్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కార్తికేయ వచ్చాడు. ఈ వేదికపై తనదైన స్టైల్లో మాట్లాడుతూ .. "అందరూ అజయ్ భూపతి గురించి మాట్లాడుతుంటే .. ఇంకా నా గురించి మాట్లాడారేంటి అనుకుంటున్నాను. అంటే ఇది మా సినిమా అనే ఫీలింగ్ లోనే ఇంకా ఉన్నాను. ఈ సినిమా కోసం నన్ను తీసుకొనేందుకు ఇప్పుడు అలుగుతున్నాను. ఈ సినిమా ఫంక్షన్ కి నన్ను ఎవరూ పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నా మూవీ ఫంక్షన్ గానే నేను భావిస్తున్నాను.
అజయ్ భూపతి నటుడిగా నాకు మరో జన్మను ఇచ్చాడు. నేను ఇలా ఉండటానికి కారకులు ఆయనే. అజయ్ తో నేను చాలా క్లోజ్ గా ఉంటాను గనుక, టెక్నీకల్ గా నేను మాట్లాడలేను. ఈ కథను ఆయన 'ఆర్ ఎక్స్ 100' సినిమా షూటింగు సమయంలోనే నాకు చెప్పాడు. అప్పటి నుంచి కూడా నేను ఈ కథను గురించి ఎగ్జైట్ అవుతూనే ఉన్నాను. అప్పడు ఆ సినిమా హిట్ కాకపోతే ఊరెళ్లి గేదెలు కాసుకుంటానని అన్నాడు. ఈ సినిమా విషయంలో కూడా ఆయన అంతే కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. అజయ్ నన్ను పొగడడం కంటే తిట్టడమే ఇష్టం .. ఎందుకంటే ఆ తిట్లలో ఒక ప్రేమ ఉంటుంది. అందువలన ఆయన తిడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తుంటాను.
అజయ్ 'ఆర్ ఎక్స్ 100' తో అంతపెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన తరువాత కూడా, రెండో అవకాశాన్ని అందుకోవడానికి అంతకంటే ఎక్కువ కష్టపడవలసి వచ్చింది. అజయ్ తో వేరే హీరోలు ఇబ్బంది పడతారేమో అనుకునేవాడిని. కానీ నేను ఆయనతో ఒక కొత్త హీరోలా ఎలా చేశానో, శర్వానంద్ కూడా ఒక స్నేహితుడిగా ఈ సినిమా చేశారని తెలిసింది. శర్వానంద్ కెరియర్ కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. చిన్న చిన్న ఫ్రెండ్ రోల్స్ దగ్గర నుంచి సైడ్ రోల్స్ చేస్తూ ఆయన స్టార్ హీరోగా ఎదుగుతూ వచ్చారు. కష్టపడి పైకొచ్చిన హీరోల పేర్లను గురించి నేను ఇంట్లో చెప్పే పేర్లలో ఆయన పేరు కూడా ఉంటుంది.
ఇక సిద్ధార్థ్ గారంటే నాకు చాలా జెలసీ .. చదువుకునే రోజుల్లో మనకి క్రష్ ఉన్న అమ్మాయిల క్రష్ గా ఆయన ఉండేవారు. 'ఏ అమ్మాయి చూసినా సిద్ధార్థ్ అంటుందేంట్రా బాబూ' అని నేను ఆయనను తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను 6 క్లాస్ లో ఉన్నప్పుడు 'బొమ్మరిల్లు' చూశాను. కానీ ఇప్పుడు ఆయనను చూస్తుంటే నాకంటే చిన్నవాడిలా కనిపిస్తున్నాడు. ఆ సీక్రెట్ ఏంటి సార్ అంటే మాత్రం చెప్పడం లేదు. 'మిమ్మల్ని అలా చూస్తుంటే గొంతు దిగడం లేదు నాన్న' అనాలనిపిస్తోంది.
'ఆర్ ఎక్స్ 100' సినిమా తరువాత రావు రమేశ్ గారు మా కుటుంబ సభ్యుడు అయ్యారు. ఈ సినిమాలో పాత్రను ఆయన కుమ్మేస్తారని తెలుసు. 'ఆర్ ఎక్స్ 100' లో నేను హీరో అయినా, నాకంటే ఎక్కువ పేరు పాయల్ కి వచ్చింది. అలాగే ఈ సినిమాలో ఎక్కువ పేరు అదితిరావుగారికి వస్తుందని నేను అనుకుంటున్నాను. చైతన్ విషయానికి వస్తే 'పిల్లా రా' సాంగ్ ఇచ్చి నా కెరియర్ కి ఎంతో హెల్ప్ చేశాడు. ఆయన ఎంతమంది హీరోలతో చేసినా నా మ్యూజిక్ డైరెక్టరే. ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర గారి గురించి అజయ్ ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. ఆయనతో కలిసి త్వరలో ఒక సినిమా చేయాలనుంది. అలాగే అజయ్ నాతో తొందరగా ఒక సినిమా చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.