Begin typing your search above and press return to search.
గ్యాంగ్ లీడర్ విలన్ హెల్ప్ అయ్యాడా?
By: Tupaki Desk | 14 Sep 2019 6:20 AM GMTనిన్న విడుదలైన నాని గ్యాంగ్ లీడర్ మంచి ఓపెనింగ్స్ తో ప్రారంభమయ్యింది. ట్రైలర్ నుంచే ఇదో కంప్లీట్ ఫ్యామిలీ రివెంజ్ ఎంటర్ టైనర్ అనే ఇంప్రెషన్ కలిగించడంతో యూత్ తో పాటు లేడీ ఫ్యాన్స్ కూడా బాగానే క్యూ కట్టారు. ఆరెక్స్ 100 ఫేమ్ కార్తికేయ మొదటిసారి విలన్ గా చేయడం కూడా మరో ఆకర్షణగా నిలిచింది. అయితే విలనీని పండించడంలో కార్తికేయ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ న్యాచురల్ స్టార్ నాని ముందు కొన్ని సందర్భాల్లో తేలిపోయాడనే చెప్పాలి.
ఇప్పటిదాకా కేవలం నాలుగు సినిమాలే చేసిన కార్తికేయకు ఇది చాలా పెద్ద సవాల్. అటేమో నాని లక్ష్మి శరణ్య లాంటి సీనియర్ ఆర్టిస్టులు. బాడీ బిల్డప్ పరంగా ఆ క్యారెక్టర్ కు న్యాయం చేకూర్చాడు కాని ఇంకా బెటర్ మెంట్ అయితే ఉండాల్సిందని ప్రేక్షకుల ఓపెన్ కామెంట్. రిస్క్ గా అనిపించినా చేయడమైతే చేశాడు కాని కార్తికేయ ఇంకాస్త సీరియస్ గా ఫోకస్ పెడితే విలన్ గానూ మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు అనిపిస్తోంది.
గతంలో గోపిచంద్ హీరోగా వర్క్ అవుట్ కానప్పుడు వర్షం - జయంలలో విలన్ గా అద్భుతంగా మెప్పించి మళ్ళి హీరో అయ్యాడు. శ్రీహరిది కూడా ఇంచుమించు ఇదే కథే. కార్తికేయ కూడా ఇదే రూట్ లో వెళ్దామని ప్రయత్నించాడు కాని ఎక్స్ ప్రెషన్స్ పరంగా చేయాల్సిన హోం వర్క్ అయితే చాలా ఉంది. న్యాచురల్ గా ఉంటేనే నాని రేంజ్ యాక్టర్ తో సరితూగేలా విలనీతో మెప్పించవచ్చు. కార్తికేయకు ఇలాంటివి పండించాలంటే ఇంకొంచెం టైం పట్టేలా అయితే ఉంది