Begin typing your search above and press return to search.

వితంతువుతో ప్రేమాయణం.. హీరో సెకండ్ హిట్ అందుకుంటాడా..??

By:  Tupaki Desk   |   6 March 2021 9:53 AM GMT
వితంతువుతో ప్రేమాయణం.. హీరో సెకండ్ హిట్ అందుకుంటాడా..??
X
ఆర్ఎక్స్100 మూవీతో ఫస్ట్ సూపర్ హిట్ అందుకున్న హీరో కార్తికేయ.. ఆ తర్వాత ఆర్ఎక్స్100 రేంజి హిట్టు కొట్టలేదని చెప్పాలి. హిట్టు పడకపోయినా హీరోకు అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. అందుకే సినిమా హిట్టు ఫట్టు తేడాలేకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఆ విధంగానే తాజాగా చావుకబురుచల్లగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పటికే ట్రైలర్ తో సినిమా పై అంచనాలు పెంచేసాడు హీరో. ఆద్యంతం ఆకట్టుకుంటున్న ట్రైలర్ చూస్తే సినిమాలో కామెడీకి కొదవలేదని అర్ధమవుతుంది. బస్తీ బాలరాజ్ అనే పాత్రలో కార్తికేయ నటించగా.. భర్తలేని మహిళపాత్రలో మల్లికగా లావణ్యత్రిపాఠీ కనిపించనుంది.

ప్రేక్షకులకు అదే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమాలో భర్తలేని వితంతువు చుట్టూ ప్రేమంటూ తిరుగుతుంటాడు హీరో బస్తీ బాలరాజ్. చూడటానికి ఇద్దరి మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగానే ఉన్నాయి కానీ.. వితంతువు వెనకపడటం అనేది ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. నిజానికి విడో తో ప్రేమాయణం కాన్సెప్ట్ చాలా సినిమాలలో చూపించారు. కానీ అవన్నీ సరైన కారణాలతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంటాయి. ఇదివరకు సింధూరపువ్వు అనే సినిమా కూడా విడోకు హీరోకు మధ్య లవ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఆ సినిమా పాటలతో, ఎమోషనల్ సన్నివేశాలతో బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకుంది. అలాగని ఈ చావుకబురుచల్లగా సినిమాను సింధూరపువ్వుతో పోల్చలేం. ఎందుకంటే ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో తెరకెక్కింది. కానీ బ్యాక్ డ్రాప్ లో సరైన స్టోరీ లేకపోతే మాత్రం కస్టమనే చెప్పాలి. ఈరోజుల్లో సినిమాలో ఎంత కామెడీ ఉన్నా కథాకథనాలు సరిగ్గా లేకపోతే ఫట్టుమంటున్నాయి. ట్రైలర్ పరంగా అయితే కార్తికేయ సక్సెస్ అయ్యాడు. మరి మార్చ్ 19న సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.