Begin typing your search above and press return to search.
కథ నచ్చింది .. హీరో ఎవరైతే నాకేంటి? అనేసిందట!
By: Tupaki Desk | 30 March 2021 3:30 PM GMTఈ మధ్య కాలంలో యువ కథానాయకులకు కార్తికేయ గట్టిపోటీ ఇస్తున్నాడు. మంచి హైటూ .. అందుకుతగిన ఫిజిక్ ఉన్న కార్తికేయ, విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కార్తికేయ, తాజాగా చేసిన 'చావుకబురు చల్లగా' ప్రస్తుతం థియేటర్లలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథానాయిక లావణ్య త్రిపాఠితో కలిసి ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సినిమాతో పాటు తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి కార్తికేయ ప్రస్తావించాడు.
" నేను చేసిన సినిమాల్లో 'గుణ 369' సినిమాలోని పాత్ర నాకు చాలా ఇష్టం. ఆ సినిమా నిర్మాత తిరుమల రెడ్డిగారు .. అల్లు అరవింద్ గారికి మంచి స్నేహితుడు. ఆ సినిమాకి రీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఆయన అల్లు అరవింద్ గారికి చూపించారు. ఆ సినిమా చూసిన అల్లు అరవింద్ గారు .. హీరో చాలా బాగా చేశాడు అన్నారట. నా అదృష్టం కొద్దీ 'గుణ 369' ట్రైలర్ లాంచ్ .. అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా జరిగింది. ఆ సమయంలో ఆయన 'వెల్ కమ్ టు గీతా ఆర్ట్స్' అని నన్ను ఉద్దేశించి స్టేజ్ పై అన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకే నాకు గీతా ఆర్ట్స్ 2 నుంచి కాల్ వచ్చింది" అని చెప్పాడు.
ఇక లావణ్య త్రిపాఠిని గురించి కార్తికేయ మాట్లాడుతూ .. "లావణ్యత్రిపాఠిని నేను 'అందాల రాక్షసి' సినిమాలో తొలిసారిగా చూశాను. అప్పుడు నేను బీటెక్ చదువుతున్నాను .. ఆమెతో కలిసి నేను నటిస్తానని అస్సలు అనుకోలేదు. చావుకబురు చల్లగా' షూటింగుకి ముందు, నేను .. లావణ్య త్రిపాఠి .. డైరెక్టర్ గారు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్లాము. అప్పుడు నేను .. "నాతో ఈ సినిమా చేయడం మీకు ఓకేనా? మీరు చాలామంది స్టార్స్ తో చేశారు గదా? అన్నాను. అప్పుడు ఆమె "నేనసలు హీరో సైడ్ ఆలోచించనే లేదు. కథ బాగా నచ్చింది .. హీరో ఎవరైతే ఏంటి" అనేసింది. నేను అడిగినందుకైనా .. మీరు మంచి హీరోనే కదా అందుకే మీ పక్కన చేస్తున్నాను అని అనొచ్చుగదా" అంటూ నవ్వేశాడు.