Begin typing your search above and press return to search.
అఖిల్ కెరీర్ నాశనం చేయనంటున్న కార్తికేయ
By: Tupaki Desk | 1 Oct 2018 4:39 PM GMTరాజమౌళి-రమల తనయుడు కార్తికేయకు ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులున్నారు. వారిలో అక్కినేని అఖిల్ మరీ క్లోజ్. వీళ్లిద్దరూ చాలా ఏళ్ల నుంచి చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. కార్తికేయ ఇప్పటికే తండ్రి సినిమాలతో పాటు వేరే చిత్రాల ప్రొడక్షన్ బాధ్యతలు చూస్తున్నాడు. త్వరలోనే అతను దర్శకుడిగా కూడా మారతాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ క్లోజ్ ఫ్రెండ్ అఖిల్ హీరోగా సినిమా తీస్తారా అని కార్తికేయను అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పాడు.
‘‘అఖిల్ కెరీర్ నాశనం చేయదలచుకోవాలంటే నేను అతడి సినిమాకు డైరెక్షన్ చేయాలి’’ అంటూ నవ్వేసిన కార్తికేయ.. ‘‘ఒకవేళ నిజంగా అఖిల్ తో నేను సినిమా చేయాల్సి వస్తే.. ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి చేస్తున్న సినిమా లాంటిది చేయాలి. వెంకీ సినిమా అఖిల్ కు సరిగ్గా సరిపోతుంది’’ అన్నాడు.
ఇక తనకు కాబోయే భార్య పూజ గురించి.. తమ పెళ్లి గురించి కార్తికేయ స్పందిస్తూ.. పూజాతో నా ప్రేమ ఆరేళ్ల క్రితం మొదలైంది. మా ఇద్దరి అభిరుచులు వేరు. కానీ ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించుకుంటాం. నేను హైపర్ గా ఉంటాను. ఆమె చాలా కామ్. అందుకే మా ఇద్దరి మధ్య బంధం బాగుంది. త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా వివాహ వేదిక ఎక్కడ అనేది నిర్ణయించలేదు. డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకుంటున్నాం. హిల్ స్టేషన్ లోనే ఉండొచ్చు. కూర్గ్ కానీ.. చిక్ మంగుళూరులో కానీ జరగొచ్చు’’ అని చెప్పాడు.