Begin typing your search above and press return to search.
దిల్ రాజా.. థియేటర్లు కబ్జా చేయడమా?
By: Tupaki Desk | 7 Aug 2018 8:03 AM GMTతెలుగు సినీ పరిశ్రమలో ఆ నలుగురు నిర్మాతంటూ తరచుగా ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. వాళ్లు థియేటర్లను గుప్పెట్లో పెట్టుకున్నారని.. చిన్న సినిమాలకు సహకరించరని విమర్శలు వస్తుంటాయి. ఇలాంటివి ఎవ్వరూ నమ్మొద్దని.. ఇవన్నీ చెత్త మాటలని అంటున్నాడు యువ కథానాయకుడు కార్తికేయ. అతను హీరోగా నటించిన ‘ఆర్ ఎక్స్ 100’ సెన్సేషనల్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 25 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహించిన వేడుకకు దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ.. దిల్ రాజు లాంటి నిర్మాత తమ వేడుకకు రావడమే ఒక పెద్ద గౌరవమని.. ఇప్పుడు తాము నిజమైన సక్సెస్ సాధించామని అనిపిస్తోందని చెప్పాడు. తాను ఇంతకుముందు దిల్ రాజు గురించి చెడుగా విన్నట్లు అతను వెల్లడించాడు.
దిల్ రాజు లాంటి నలుగురు నిర్మాతలు థియేటర్లు కబ్జా చేశారని.. వాళ్లు చిన్న సినిమాలకు సహకరించరని.. ఎవరెవరో ఏదేదో చెప్పేసి తమను భయపెట్టారని అతనన్నాడు. కానీ ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాకు రాజు ఎంతగానో సహకరించారని.. అనుకున్న దాని కంటే ఎక్కువ థియేటర్లు ఇచ్చారని.. ఇప్పుడు ఆయన సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’ విడుదలవుుతన్నా కూడా తమ సినిమాను థియేటర్ల నుంచి తీయించట్లేదని.. చాలా చోట్ల మెయిన్ థియేటర్లలో తమ సినిమాను కొనసాగనిస్తూ వేరే థియేటర్లలో తన సినిమాను రిలీజ్ చేసుకుంటున్నారని అన్నాడు కార్తికేయ. టాలెంట్ ఉంటే ఇక్కడ ఎవ్వరూ ఎవ్వరినీ అడ్డుకోరని.. అది తమ విషయంలోనే రుజువైందని.. ఇలాంటి చెత్త మాటల్ని పట్టించుకోకుండా పని మీద దృష్టిపెట్టాలని కార్తికేయ సూచించాడు. కొత్త టాలెంట్ వస్తే దిల్ రాజు లాంటి వాళ్లు మరింత సంతోషిస్తారని.. వాళ్లతో సినిమాలు తీయాలని చూస్తారని అన్నాడు. తాను ఈ మాట చెప్పడం ద్వారా రాజును పరోక్షంగా తనతో సినిమా చేయాలని కమిట్ చేస్తున్నట్లు కార్తికేయ చమత్కరించడం విశేషం.