Begin typing your search above and press return to search.

మెగా డైలాగ్.. రియల్ చిరుతతో యువ హీరో 

By:  Tupaki Desk   |   23 Nov 2022 11:30 PM GMT
మెగా డైలాగ్.. రియల్ చిరుతతో యువ హీరో 
X
ఆర్ఎక్స్ 100 సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి గుర్తింపును అందుకున్న యువ హీరో కార్తికేయ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు. కానీ సరైన సక్సెస్ అయితే పడడం లేదు. 2019లో అయితే అతను గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. ముఖ్యంగా తమిళంలో కూడా హిప్పీ అనే ఒక సినిమాతో పరిచయం అయ్యాడు ఇక నాని గ్యాంగ్ లీడర్ సినిమా లో కూడా విలన్ పాత్రలో నటించాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవిని ఒక వేదికపై ఆకాశానికి లేపిన కార్తికేయ ఒక్కసారిగా వైరల్ అయిపోయాడు. అతను మెగాస్టార్ కి చాలా పెద్ద అభిమాని అని ఒక్క మాటలో చెప్పేసాడు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తను మెగా అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్గా అతను సోషల్ మీడియాలో రియల్ చిరుతతో పోస్ట్ చేస్తూ రామ్ చరణ్ చిరుత డైలాగ్ గుర్తు చేసుకున్నాడు. ఈ అడవి నాదే ఈ వేటా నాదే అంటూ.. లంకేశ్వరుడు అనే సినిమాను ప్రస్తుతం చూస్తున్నాను అని తెలియజేశాడు.

ఇక రియల్ చిరుతపై అతని చేయి పెట్టిన విధానం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదైతే ఏంటి స్టిల్ అయితే అదిరింది అంటూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పాజిటివ్గా స్పందిస్తున్నారు.

ఇక కార్తికేయ కెరీర్ విషయానికి వస్తే.. క్యారెక్టర్ నచ్చితే పాజిటివ్ నెగిటివ్ అని చూడకుండా సినిమాలు చేస్తాను అని కూడా ఈ హీరో ఒక క్లారిటీ అయితే చేశాడు. వీలైనంతవరకు నటుడిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అనుకుంటున్నాను ఓపెన్ గా తెలియజేశారు.

గత తేడాది కార్తికేయ రెండు ప్రయోగాలు చేశాడు. ముఖ్యంగా 'చావు కబురు చల్లగా' అనే సినిమా సరికొత్తగా తెరపైకి వచ్చింది అని బాగానే హడావిడి చేశాడు. కానీ ఆ సినిమా అందించిన రిజల్ట్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఆ ప్రయోగం తర్వాత రాజా విక్రమార్క మరో సినిమా చేశాడు. అది కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయింది.

తమిళంలోన స్టార్ హీరో అజిత్ వాలిమై లో విలన్ సినిమా చేశాడు. ఆ సినిమా కలెక్షన్స్ అయితే అందుకుంది కానీ కార్తికేయకు పెద్దగా క్రేజ్ అయితే అందించలేకపోయింది. ఒక ప్రస్తుతం ఒక కొత్త దర్శకుడి తోనే అతను సినిమా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి బాక్సాఫీస్ వద్ద కార్తికేయ మళ్ళీ ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.