Begin typing your search above and press return to search.
టైమ్ అంటే నిఖిల్ 'కార్తికేయ 2' దే!
By: Tupaki Desk | 3 Sep 2022 11:32 AM GMTనిఖిల్ నటించిన మిస్టిక్ ఫాంటసీ థ్రిల్లర్ `కార్తికేయ 2` ని చూస్తుంటే డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి `పోకిరి`లో `ఎప్పొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా` అని మహేష్ చెప్పిన డైలాగ్ గుర్తొస్తోందట. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. రిలీజ్ రెండు దఫాలుగా వాయిదా పడినా చివరికి ఆగస్టు 13న నిఖిల్ నటించిన `కార్తికేయ` భారీ స్థాయిలోపాన్ ఇండియా మూవీగా విడుదలై ఊహకందని రీతిలో సౌత్ లోనూ, నార్త్ లోనూ రికార్డుల మోత మోగిస్తోంది.
ఈ మూవీ విడుదల టైమ్ లో ఇబ్బందులు పడినా కరెక్ట్ టైమ్ కే థియేటర్లలోకి రావడంతో ప్రతీ అంశం ఈ మూవీకి బాగా కలిసి వస్తోంది. సినిమా విడుదలై మూడు వారాలు దాటినా ఇప్పటికే దీని జోరు సౌత్ తో పాటు నార్త్ లోనూ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే రూ.110 కోట్ల మార్కుని దాటి విజయంతంగా ప్రదర్శింపబడుతూ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ మూవీ తరువాత ఎన్ని సినిమాలు థియేటర్లలో పోటీపడినా `కార్తికేయ 2`ని మాత్రం బీట్ చేయలేక చేతులు ఎత్తేస్తున్నాయి.
దీనికి తోడు వరుసగా కృష్ణాష్టమి, వినాయక చవిత సెలవులు రావడం.. వీకెండ్స్ లో థియేటర్లలో చూడటానికి `కార్తికేయ 2`ని మించిన సినిమా లేకపోవడంతో అంతా ఈ మూవీ కోసమే ఎగబడుతున్నారు. దీంతో ఈ మూవీ జోరు ఎక్కడా తగ్గడం లేదు.
దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ పోటీలో మరో సినిమా లేకపోవడంతో అంతా టైమ్ అంటే `కార్తికేయ 2` దే అంటూ కామెంట్ లు చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన `రంగ రంగ వైభవంగ`, దర్శకుడు అనుదీప్ కె.వి కథ అందించిన `ఫస్ట్ డే ఫస్ట్ షో` సినిమాలు కూడా ఫస్ట్ రోజే నెగెటివ్ టాక్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశకు గురిచేశాయి.
ఇది కూడా `కార్తికేయ 2`కు కలిసి రావడంతో శుక్రావరం రిలీజ్ అయిన సినిమాలని మించి వసూళ్లు తక్కడం విశేషం. బాలీవుడ్ లో, టాలీవుడ్ లో మరో వారం వరకు `బ్రహ్మాస్త్ర` మినహా మరో పెద్ద సినిమా లేకపోవడంతో `కార్తికేయ 2` హవా మరో వారం పాటు సాగబోతోంది. `బ్రహ్మాస్త్ర` టాక్ బాగటుంటే దాని ప్రభావం కొంత మేర ఈమూవీ కలెక్షన్ లపై పడే అవకాశం వుంది. అయితే నెగెటివ్ టాక్ గనక వస్తే `కార్తికేయ 2` మరింతగా పుంజు కోవడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇదిలా వుంటే ఇప్పటికే యుఎస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన `కార్తికేయ 2` త్వరలో 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడం ఖాయం అని తెలుస్తోంది. శనివారం యుఎస్ లో నేషనల్ సినిమా డే జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ దరని 3 డాలర్లకు తగ్గించారట. దీంతో జనం `కార్తికేయ 2` కోసం ఎగబడుతున్నారని తెలుస్తోంది. ఒక్కో సెంటర్లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోవడంతో సోల్డ్ ఔట్ బోర్డ్ లు పెడుతున్నారట. చిన్న సినిమాకు యుఎస్ లో నాలుగవ వారం ఇంత డిమాండ్ పెరగడం ఇదే ప్రప్రధమం అని టైమ్ అంటే కార్తికేయ 2 దే నని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.