Begin typing your search above and press return to search.

కార్తికేయడి సెన్సార్ టాక్ ఏంటీ?

By:  Tupaki Desk   |   29 July 2022 2:54 PM GMT
కార్తికేయడి సెన్సార్ టాక్ ఏంటీ?
X
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్ న‌టించిన లేటెస్ట్ సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ `కార్తికేయ 2`. యువ ద‌ర్శ‌కుడు చందూ మొండేటి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని తెర‌కెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ లపై అభిషేక్ అగ‌ర్వాల్‌, టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిచారు. 2014లో వ‌చ్చిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ `కార్తికేయ‌` మూవీకిది సీక్వెల్‌. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టించారు.

బాలీవుడ్ పాపుల‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అనుప‌మ్ ఖేర్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ నుంచే ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ని సొంతం చేసుకుంది. తొలి పార్ట్ సూప‌ర్ హిట్ గా నిలిచి ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంతో `కార్తికేయ 2` పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

శ్రీకృష్ణుడికి సంబంధించిన ర‌హ‌స్యాల నేప‌థ్యంలో ద్వార‌క చుట్టూ సాగే క‌థ కావ‌డంతో ఈ మూవీ ప్ర‌త్యేకంగా నిలిచింది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ల‌తో ఆక‌ట్టుకున్న ఈ మూవీ ఆగ‌స్టు 12న పాన్ ఇండియా వైడ్ గా తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ‌, హిందీ భాష‌ల‌లో ఏక కాలంలో రిలీజ్ కాబోతోంది.

ముందు ఈ మూవీని జూలై 22న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. ప్రేక్ష‌కుల నుంచి టీజ‌ర్‌, ట్రైల‌ర్ ల‌కు ల‌భించిన స్పంద‌న‌ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీ రిలీజ్ కు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని డేట్ ని ఫైన‌ల్ చేసుకున్నారు. అయితే నాగ‌చైత‌న్య న‌టించిన `థాంక్యూ` అదే రోజున రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో నిర్మాత దిల్ రాజు రిక్వెస్ట్ మేర‌కు `కార్తికేయ 2` టీమ్ త‌మ సినిమా రిలీజ్ ని వాయిదా వేసింది. ఆగ‌స్టు 12కు రిలీజ్ డేట్ ని మార్చేసింది.

రిలీజ్ టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ మూవీ సెన్సార్ కు పంపించారు. శుక్రవారం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తయ్యాయి. ఒక్క క‌ట్ కూడా విధించ‌కుండా ఈ మూవీకి యు/ఏ స‌ర్టిఫికెట్ ల‌భించింది.

ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. సెన్సార్ స‌భ్యులు చిత్ర బృందాన్ని అభినందించి సినిమాలో అద్భుత‌మైన స‌న్నివేశాలు వున్నాయ‌ని, మంచి కాన్సెప్ట్ తో ఈ మూవీని నిర్మించార‌ని, సినిమా ఆద్యంతం ఆలోచ‌న రేకెత్తించే విధంగా వుంద‌ని చిత్ర బృందాన్ని అభినందించార‌ని మేక‌ర్స్ తెలిపారు.