Begin typing your search above and press return to search.
`అల వైకుంఠపురములో` హిందీ రీమేక్ అదీ సంగతి!
By: Tupaki Desk | 7 Sep 2021 1:30 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 2020 బ్లాక్ బస్టర్ హిట్ అల వైకుంఠపురములో బాలీవుడ్ లో రీమేకవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా హిందీ వెర్షన్ షూటింగ్ ప్రారంభం కాబోతోందని కార్తీక్ స్వయంగా హింట్ ఇచ్చాడు. దర్శకుడు రోహిత్ ధావన్ తో కలిసి కార్తీక్ ఓ ఫోటోని షేర్ చేసాడు. దీంతో `అల వైకుంఠపురములో` రీమేక్ సెట్స్ కెళుతోందని హింట్ అందింది.
కార్తీక్ ఆర్యన్ వరుసగా కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లను కలిగి ఉన్నాడు. అల్లు అర్జున్ 2020 హిట్ చిత్రం `అల వైకుంఠపురములో` హిందీ రీమేక్ కోసం అతను దర్శకుడు రోహిత్ ధావన్ తో చేతులు కలిపారు. హిందీ రీమేక్ కు `షెహజాదా` అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని కథనాలొచ్చాయి. కార్తిక్ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే సూచనలు గుప్పిస్తూ తాజాగా పోస్ట్ చేశారు. రోహిత్ ధావన్ తో కార్తీక్ ఒక ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో `కిరీటం ఎమోటికాన్` ను క్యాప్షన్ గా పంచుకున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఏక్తా కపూర్ వ్యాఖ్యల విభాగంలో గుండె ఎమోటికాన్ తో వెల్ కం చెప్పారు.
రోహిత్ ధావన్ చివరిసారిగా అతని సోదరుడు వరుణ్ ధావన్.. జాన్ అబ్రహం.. అక్షయ్ ఖన్నా .. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన డిషూమ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం ఫ్రెడ్డీ అనే సినిమా చేస్తున్నాడు. అతను భూల్ భూలైయా 2.. ధమాకా.. కెప్టెన్ ఇండియా (హన్సల్ మెహతా) చిత్రాలతో బిజీ. సాజిద్ నదియాద్ వాలాతో ఇంకా పేరు పెట్టని చిత్రంలోనూ నటిస్తున్నాడు. కరణ్ జోహార్ దోస్తానా 2 నుంచి డిఫరెన్సెస్ వల్ల తప్పుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. కొంత షూట్ జరిగాక కార్తీక్ ని ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించడం సంచలనమైంది.