Begin typing your search above and press return to search.

యంగ్ హీరో పెళ్లి ప్లానింగ్ ఇలా!

By:  Tupaki Desk   |   7 Dec 2022 5:32 AM GMT
యంగ్ హీరో పెళ్లి ప్లానింగ్ ఇలా!
X
బాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చాడు కార్తీక్ ఆర్య‌న్. తొలి సినిమా `ప్యార్ కా పంచ‌నామా`తో స‌క్సెస్ అందుకుని న‌టుడిగా ఒక్క‌సారిగా బిజీ అయ్యాడు. అటుపై తొలి హిట్ కి సీక్వెల్ చేసి సైతం విజ‌యం ఖాతాలో వేసుకున్నాడు. అటుపై వ‌రుస విజ‌యాలు యంగ్ హీరో రేంజ్ ని మార్చేసాయి. ఇటీవ‌లే `భూల్ భుల‌య్య‌-2` తో భారీ స‌క్సెస్ ఖాతాలో వేసుకున్నాడు.

స్టార్ హీరోలంతా ఫెయిలైన వేళ కార్తీక్ ఆర్య‌న్ మాత్రం స‌క్సెస్ అందుకుని బాలీవుడ్ ప‌రువును నిల‌బెట్టిన హీరోల జాబితాలో నిల‌బ‌డ్డాడు. దీంతో యంగ్ హీరో మ‌రింత బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం రోహిత్ ధావ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `షెహ్ జాదా`.. స‌మీర్ విద్వాన్స్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌త్య ప్ర‌మ్కి క‌థ` చిత్రాల్లో న‌టిస్తున్నాడు. యంగ్ హీరో స‌క్సెస్ నేప‌థ్యంలో రెండు సినిమాలపై భారీ అంచ‌నాలున్నాయి.

వ‌చ్చే ఏడాది ఇవి ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. అయితే 32 ఆర్య‌న్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. జీవితంలోకి ఇంకా భాగ‌స్వామిని ఆహ్వానించ‌లేదు. మ‌రి ఆ ఘ‌ట్టం ఎప్పుడు చోటుచేసుకుంటుంద‌ని ప్ర‌శ్నిస్తే....ప్ర‌స్తుతానికి పెళ్లి ఆలోచ‌న లేన‌ట్లు తెలిపాడు. వృత్తిగ‌త జీవితంపై నే శ్ర‌ద్ద‌పెట్టిన‌ట్లు.... పెళ్లి పై ఎలాంటి ప్లానింగ్ కూడా లేద‌ని తెలిపాడు.

దీన్నీ బ‌ట్టి కార్తీక్ ఆర్య‌న్ ఇప్ప‌ట్లో పెళ్లిచేసుకునే వాడిలా క‌నిపించేదు. అలాగ‌ని సింగిల్ అయితేకాదు.గ‌తంలో చాలాసార్లు మింగిల్ అయ్యాడు.కొన్నా ళ్ల‌పాటు కృతి స‌న‌న్ తో డేటింగ్ చేసాడు. అటుపై సైఫ్అలీఖాన్ కుమార్తె..న‌టి సారా అలీఖాన్ తోనూ చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగాడు. సారాని పెళ్లి చేసుకుంటాడ‌ని బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి.

కానీ ఆ బంధం ఎంతో కాలం కొన‌సాగ‌లేదు. ప్ర‌స్తుతానికి సింగిల్ గానే ఉంటున్నా? మ‌న‌సుకు న‌చ్చిన అమ్మాయి తార‌స‌ప‌డితే మ‌ళ్లీ ప్రేమ ప్ర‌యాణం ష‌రా మామూలే. మ‌రి 32 ఏళ్ల హీరో పెళ్లి వార్త ఎప్పుడు చెబుతాడో ? అలా కాకుండా స‌ల్మాన్ ఖాన్ లా బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిర‌ల్ లా సాగిపోతోడా? చూడాలి.